దోషనివార‌ణ కోసం 13ఏళ్ల బాలుడిని పెళ్లాడిన టీచ‌ర్‌.. ‌

Tuition teacher marries 13-year-old student to ward off 'Manglik dosha' in Jalandhar.ఓ పంతుల‌మ్మ జ‌న్మ న‌క్ష‌త్రం రీత్యా ఏర్ప‌డిన మాంగ‌ళ్య దోష నివార‌ణ కోసం ఏకంగా 13ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2021 9:52 AM GMT
Teacher married 13-year-old student

సాధార‌ణంగా జాత‌కంలో ఏమైన దోషాలు ఉంటే.. దోష నివార‌ణ‌కు కొన్ని ర‌కాల పూజ‌లు చేస్తుంటారు. మాంగ‌ళ్య దోషం ఉంటే కొంద‌రు రావిచెట్టుతో పెళ్లి జ‌రిపిస్తారు. అయితే.. ఓ పంతుల‌మ్మ జ‌న్మ న‌క్ష‌త్రం రీత్యా ఏర్ప‌డిన మాంగ‌ళ్య దోష నివార‌ణ కోసం ఏకంగా 13ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకుంది. ఈ ఘ‌ట‌న పంజాబ్ రాష్ట్రంలోని జ‌లంధ‌ర్‌లో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని జలంధర్‌ పట్టణంలో బస్తీ బవఖేల్‌ ప్రాంతంలో ఓ యువ‌తి ట్యూష‌న్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తోంది. ఆమెకు ఎన్ని వివాహా ప్ర‌య‌త్నాలు చేసినా.. ఎంత‌కీ పెళ్లి కుద‌ర‌డం లేదు. దీంతో యువ‌తి త‌ల్లిదండ్రులు ఓ జ్యోతిష్యుడుని క‌లిసారు.

ఆ యువ‌తికి జన్మ నక్షత్రం రీత్యా మాంగల్య దోషం ఉందని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు. దీన్ని అధిగమించేందుకు కూడా ఉపాయం చెప్పాడు. మైన‌ర్ బాలుడితో పెళ్లి చేస్తే దోషం తొలగిపోతుంద‌ని చెప్పాడు. పండితుడు ఇచ్చిన సలహా మేరకు ఆ మహిళ తన వద్దకు ట్యూషన్‌కొచ్చే పిల్లల్లో ఒకడైన 13 ఏండ్ల బాలుడిని పెండ్లి కొడుకుగా ఎంపిక చేసుకున్నారు. ట్యూషన్ల కోసం వారం రోజుల పాటు బాలుడిని తమ ఇంట్లో ఉంచాలని ఆమె బాధితుడి తల్లితండ్రులను కోరింది. బాలుడు ఇంటికి తిరిగివచ్చి అక్కడ జరిగిన తంతును వివరించడంతో ఈ విషయం వెలుగుచూసింది.

వెంట‌నే బాలుడి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మహిళ కుటుంబ సభ్యులు బలవంతంగా హల్దీ-మెహందీ వేడుకలను నిర్వహించడంతో పాటు శోభనం జరిపారని ఆపై టీచర్‌ గాజులను పగులగొట్టి ఆమెను విధవగా ప్రకటించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలుడి తల్లితండ్రులు తెలిపారు. బాలుడి తల్లితండ్రులను మహిళ కుటుంబ సభ్యులు బలవంతంగా ఫిర్యాదును వెనక్కితీసుకునేలా చేశారు. ఫిర్యాదుదారు తన కేసును ఉపసంహరించారని స్ధానిక పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ గగన్‌దీప్‌ సింగ్‌ సెఖాన్‌ నిర్ధారించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సీనియర్‌ పోలీస్‌ అధికారులు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
Next Story
Share it