అయోధ్య రామాలయానికి మరికొంత భూమి కొనుగోలు.. ఇప్పటి వరకు విరాళాలు ఎన్ని వచ్చాయంటే..
Trust buys 7,285 sq ft land near Ayodhya's Ram temple complex. అయోధ్యరామాలయం సముదాయం మరింత విశాలంగా ఉండేందుకు అదనంగా మరికొంత భూమిని కొనుగోలు చేసి రామ జన్మభూమి ట్రస్ట్.
By Medi Samrat Published on 4 March 2021 4:26 AM GMT
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. రామాలయం సముదాయం మరింత విశాలంగా ఉండేందుకు అదనంగా మరికొంత భూమిని కొనుగోలు చేసి రామ జన్మభూమి ట్రస్ట్. శ్రీరామ జన్మభూమికి ఆనుకుని ఉన్న 676.85 చదరపు మీటర్ల భూమిని రూ. 1 కోటి చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించారు. శ్రీ రామ జన్మభూమికి ఆనుకుని ఉన్న ఇళ్లు, ఇతర స్థలాలను కొనేందుకు వాటి యజమానులతో చర్చలు జరుపుతున్నారు. అయితే స్వామి దీప్‌నారాయణ్‌కు చెందిన ఈ భూమిని కోటి రూపాయలు చెల్లించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొనుగోలు చేసింది. ఈ ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ ఈ లావాదేవీని నిర్వహించారు. క్రియచీటీపై గోసాయిన్‌గంజ్ ఎమ్మెల్యే ఐపీ తివారీ (బీజేపీ), ట్రస్ట్ సభ్యుడు, ఆరెస్సెస్ అయోధ్య ప్రచారక్ డాక్టర్ అనిల్ మిశ్రా సాక్షులుగా సంతకాలు చేశారు.
అయితే అయోధ్య రాంమందిర్ విశాలమైన స్థలంలో ఉండాలనే ఉద్దేశంతో మరింత కొంత భూమిని కొనుగోలు చేశారు. అయితే 2019 నవంబరు 9న సుప్రీంకోర్టు తీర్పుతో శ్రీరామ జన్మ భూమికి 70 ఎకరాల స్థలం దక్కిన విషయం తెలిసిందే. దీనిని 107 ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుని, డిజైన్లను తయారు చేశారు. గర్భ గుడితో కూడిన రాంమందిరాన్ని ఐదు ఎకరాల స్థలంలో నిర్మిస్తారు. మ్యూజియం, గ్రంథాలయం, యాగశాల, శ్రీరాముని జీవితాన్ని వివరించే తదితర చిత్రపటాల ప్రదర్శన వంటివాటి కోసం మిగిలిన స్థలాన్ని వినియోగించనున్నారు.
ఇప్పటి వరకు రూ.2,500 కోట్ల విరాళాలు:
కాగా, రాంమందిరం నిర్మాణం కోసం విరాళాల రూపంలో రూ.2,500 కోట్ల నిధులు జమ అయినట్లు తెలుస్తోంది. ఈ విరాళాల సేకరణ జనవరి15వ తేదీ నుంచి 44 రోజులపాటు కొనసాగింది. ఈ క్రమంలో రూ.2,500 కోట్ల విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27తో ఈ విరాళాల కార్యక్రమం ముగిసింది. అయితే విరాళాలలో భాగంగా ప్రజల నుంచి స్వచ్చందంగా విరాళాలు సేకరించారు. సేకరించిన విరాళాల డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయగా, మరి కొంత మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. దీంతో విరాళాల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. అయోధ్య రామజన్మ భూమి ట్రస్ట్ కార్యాలయ ఇన్‌చార్జీ ప్రకాశ్ ఉప్తా ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ… ప్రస్తుతానికి మేము సేకరించిన విరాళాల మొత్తాన్ని అంచనా వేశామని, ఇది దాదాపు 2,500 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అన్నారు. మొత్తం ఎంత విరాళం సేకరించామనే లెక్కలు తేలడానికి నెల రోజుల సమయం పడుతుందని అన్నారు.