విషాదం.. లోయలో పడి ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి

మాంగావ్‌లో గల కుంభే జలపాతాల సమీపంలో బుధవారం ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో చిత్రీకరిస్తుండగా లోయలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  18 July 2024 12:17 PM IST
Travel influencer, gorge, Maharashtra, Mangaon district, Raigad

విషాదం.. లోయలో పడి ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లలోని మాంగావ్‌లో గల కుంభే జలపాతాల సమీపంలో బుధవారం ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో చిత్రీకరిస్తుండగా లోయలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని ముంబైకి చెందిన అన్వీ కామ్దార్ (26)గా గుర్తించారు. ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ కామ్దార్‌కు రీల్స్‌ చేయడం అంటే ఇష్టం. ఆమె తన స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ వద్ద వర్షాకాలాన్ని ఆస్వాదించడానికి వెళ్ళింది. జలపాతం ఫోటోలు, వీడియోలు తీస్తుండగా.. కామ్దార్‌ కాలు జారి, ఆమె నేరుగా 350 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.

ఘటనపై సమాచారం అందిన వెంటనే సహ్యాద్రి వన్యప్రాణి సంరక్షణ సంఘం, మంగావ్ పోలీసు అధికారులు రెస్క్యూ బలగాలతో ఘటనాస్థలికి చేరుకున్నారు. మహిళ సజీవంగా ఉందని, రక్షించామని రాయగడ పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే తెలిపారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

“లోయ నుండి మహిళని రక్షించడానికి దిగుతుండగా, అక్కడ పెద్ద రాళ్ళు మాపై పడ్డాయి. మొదట్లో ఆ మహిళ బతికే లేదనిపించింది. అయితే దగ్గరికి వెళ్లిన తర్వాత ఊపిరి పీల్చుకోవడంతో ఆమె బతికే ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మరణించింది' అని సోమనాథ్ ఘర్గే తెలిపారు. పరిస్థితిని పరిశీలించిన తర్వాత సహాయక చర్యలు ప్రారంభించారు.

అంతకుముందు, జూన్ 30, మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో, పూణేలోని లోనావాలాలోని భూషి డ్యామ్ సమీపంలో జలపాతంలో మునిగి ఐదుగురు సభ్యులు మరణించారు. రెస్క్యూ టీమ్‌లు మృతదేహాలను వెలికితీశాయి. కుటుంబం మునిగిపోవడంతో తప్పిపోయిన ఇద్దరు పిల్లలలో ఒకరు చనిపోయారని జిల్లా సీనియర్ అధికారి తెలిపారు.పూణే జిల్లా కలెక్టర్ సుహాస్ దివాస్, ప్రజలు తమ సందర్శన పరిసరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్షపు వాతావరణంలో ఎటువంటి నీటి వనరుల దగ్గరకు వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story