కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం..శబరిమల బోర్డు విజ్ఞప్తిని తిరస్కరించిన ప్రభుత్వం

Travancore Devaswom Board letter to Kerala government. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.

By Medi Samrat
Published on : 10 Feb 2021 8:16 PM IST

Travancore Devaswom Board letter to Kerala government

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభనెల సందర్భంగా ఎక్కువ మందిని అనుమతించాలని శబరిమల ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఐదువేల మంది భక్తులను అనుమతించాలని, అంతకంటే ఎక్కువ మందిని అనుమతించడం కుదరదని స్పష్టం చేసింది. కుంభనెల నేపథ్యంలో ఈనెల 12న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనుంది.

ఈ సందర్భంగా 15 వేల మంది భక్తులకు అవకాశం కల్పించాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కోరింది. కేరళ ప్రభుత్వానికి దేవస్థానం బోర్డు ఇటీవల ఓ లేఖ కూడా రాసింది. దీంతో కేరళ రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్‌ తీవ్రతను అంచనా వేసి.. నిర్ణయాన్ని వెల్లడించాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖను కేరళ సర్కార్‌ ఆదేశించింది.

ఆలయంలోకి ఎక్కువ మంది భక్తులను అనుమతిస్తే వైరస్‌ తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం దేవస్థానం బోర్డు చేసిన విజ్ఞప్తి తిరస్కరించింది.


Next Story