35 కి.మీ వెనక్కి ప్రయాణించిన ఎక్స్ ప్రెస్ రైలు.. త‌ప్పిన భారీ ప్ర‌మాదం

Train rolls backwards for 35km in Uttarakhand.ఉత్తరాఖండ్‌లో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే ఊహకంద‌ని పెను ప్ర‌మాదం జ‌రిగి ఉండేది. ఓ రైలు వెన‌క్కు ప్ర‌యాణించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2021 4:26 AM GMT
Train rolls backward for 35km in Uttarakhand

ఉత్తరాఖండ్‌లో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే ఊహకంద‌ని పెను ప్ర‌మాదం జ‌రిగి ఉండేది. ఓ రైలు వెన‌క్కు ప్ర‌యాణించింది. అది ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 35 కిలోమీట‌ర్ల‌కు పైగా వెన‌క్కి ప‌రుగులు తీసింది. ఆ స‌మయంలో ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. ఏం జరుగుతుందో తెలీక అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. అదృష్ట వ‌శాత్తు ఆ స‌మ‌యంలో ప‌ట్టాల‌పై ఎవ‌రు లేక‌పోవ‌డం.. ఏ రైలు కూడా ఆ మార్గంలో రాక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. లేదంటే.. ఎంత‌టి ప్ర‌మాదం సంభ‌వించేదో ఊహించ‌డానికే క‌ష్టంగా ఉంది. వివ‌రాల్లోకి వెళితే.. పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ లోని తనక్‌పూర్‌ వెళ్తోంది.


కొంత‌దూరం బాగానే వెళ్లింది. కానీ ఒకేసారి స‌డెన్ బ్రేక్ వేయ‌డంతో రైలు రివ‌ర్స్‌లో ప్ర‌యాణం చేయ‌డం మొద‌లుపెట్టింది. అలా ఓ 35 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి త‌న‌తంట తానే ఆ రైలు ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ట్రాక్‌ మీద వేరే రైళ్లు రాకపోవడం.. జనాలు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై రైల్వే అధికారులు స్పందించారు. 'సడెన్‌గా పట్టాలపైకి ఓ జంతువు వచ్చింది. దాన్ని కాపాడటం కోసం డ్రైవర్ సడెన్‌ బ్రేక్‌ వేశాడు. ఆ స‌మ‌యంలో ట్రైన్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో.. రైలు దానిక‌దే వెన‌క్కి ప్ర‌యాణించ‌డం ప్రారంభించింది. బన్‌బాసా నుంచి చనక్‌పూర్‌ వరకు వెళ్లిన రైలు ఆ తర్వాత ఆగిపోయింది. ఈ సమయంలో రైలులో 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఉన్నారు. రైలు ఆగ‌గానే ప్ర‌యాణీకుల‌ను దించి వారంద‌రిని బ‌స్సుల ద్వారా వారి స్వ‌స్థ‌లాల‌కు పంపిచాము. బాధ్యులుగా భావించి లోకో పైలెట్‌, గార్డ్‌ని సస్పెండ్‌ చేసినట్లు' చంపావత్‌ ఎస్పీ లోకేశ్వర్‌ సింగ్ తెలిపారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు.



Next Story