గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్ ట్రైన్‌.. 50 మందికి పైగా గాయాలు

Train collision in Gondia leaves over 50 people injured.గూడ్స్ రైలును ప్యాసింజ‌ర్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌నలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2022 6:38 AM GMT
గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్ ట్రైన్‌.. 50 మందికి పైగా గాయాలు

గూడ్స్ రైలును ప్యాసింజ‌ర్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌నలో ప్యాసింజ‌ర్ రైలు మూడు బోగీలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో 50 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం తెల్ల‌వారుజామున మ‌హారాష్ట్ర‌లోని గోండియా స‌మీపంలో చోటు చేసుకుంది. ఎలాంటి ప్రాణ న‌ష్టం లేక‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సిగ్న‌ల్ త‌ప్పిదం కార‌ణంగా ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు ప్యాసింజర్ రైలు వెళ్తోంది. రాత్రి 1.20 ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసినా గూడ్స్‌ రైలును ఢీకొనడంతో తప్పించుకోలేకపోయాడు. ప్ర‌మాద స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఓ ప్ర‌యాణికుడికి తీవ్ర‌గాయాలు కావ‌డంతో ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించినట్లు అధికారులు చెబుతున్నారు.

పునరుద్ధరణ పనులు పూర్తి అయిన వెంట‌నే 5:24 గంటలకు ప్రమాద స్థలం నుండి బయలుదేరి 5:44 గంటలకు గోండియా రైల్వే స్టేషన్‌కు ప్యాసింజ‌ర్ రైలు చేరుకుంది. కాగా.. ఈ ప్ర‌మాదంపై ద‌ర్యాప్తు ఆదేశించ‌న‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Next Story