టమాట ధరలపై కేంద్రం కీలక ప్రకటన.. మరో రెండు వారాల్లో..
Tomato prices could soften in December with arrival of fresh crop. గత కొన్ని రోజులుగా అకాల వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే టమాటా, ఉల్లి ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
By అంజి Published on 27 Nov 2021 4:37 AM GMTగత కొన్ని రోజులుగా అకాల వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే టమాటా, ఉల్లి ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అయితే ఉత్తరాది రాష్ట్రాల నుంచి తాజా పంటలు వస్తుండటంతో డిసెంబర్ నుంచి కూరగాయలు, పండ్ల ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. "ఉత్తర భారత రాష్ట్రాల నుండి టమాటా దిగుబడులు డిసెంబర్ ప్రారంభం నుండి ప్రారంభమవుతాయి. ఇది లభ్యతను పెంచుతుంది. అలాగే ధరలు తగ్గడానికి దారి తీస్తుంది. డిసెంబర్‌లో, గత సంవత్సరంతో సమానంగా టమాటాల దిగుబడి ఉంటుందని అంచనా వేయబడింది" అని ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
టమాటా ధరలు ఒక్కసారిగా పెరగడానికి గల కారణాలను కూడా మంత్రిత్వ శాఖ వివరించింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లలో అకాల వర్షాల కారణంగా సెప్టెంబర్ చివరి నుండి రిటైల్ టమాటా ధరలు పెరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పంట నష్టం జరగడంతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి దిగుబడి ఆలస్యమైంది. దీనికి తోడుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీని వల్ల టమాటా సరఫరాకు అంతరాయం ఏర్పడి పంట నష్టం జరిగిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఉల్లిపాయల రిటైల్ ధరలు 2020, 2019లో ఉన్న స్థాయికి గణనీయంగా తగ్గాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో 21.32 లక్షల టన్నులు మాత్రమే 19.62 లక్షల టన్నులు వచ్చాయి.
"సరఫరా గొలుసులో ఏవైనా స్వల్ప అంతరాయాలు లేదా భారీ వర్షాల కారణంగా నష్టం వాటిల్లడం వల్ల ధరలు పెరుగుతాయి" అని టమాటా ధర చాలా అస్థిరంగా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఓ తాజా పరిశోధన ప్రకారం.. ఉత్తరాది రాష్ట్రాల నుండి టమాటా దిగుబడి వచ్చినా.. అది కనీస అవసరాలకు సరిపోదని తేల్చింది. మరో రెండు నెలల పాటు టమాటా ధరలు రికార్డు స్థాయిలోనే ఉంటాయని చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సాగు అవుతున్న పంట అందుబాటులోకి వచ్చిన తర్వాతే ధరలు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పింది. టమాటా ధర పెరగడంతో మిగతా కూరగాయల ధరలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి.