బోరుబావిలో పడిన పసిపాప.. 17 గంటల రెస్క్యూ తర్వాత శవమై బయటకు రావడంతో..

ఒకటిన్నర ఏళ్ల బాలిక బోరుబావిలో పడి 17 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ.. బోరుబావిలోనే చిక్కుకుపోయి మరణించింది.

By అంజి
Published on : 15 Jun 2024 9:00 AM IST

Toddler, borewell, Gujarat, Amreli district

బోరుబావిలో పడిన పసిపాప.. 17 గంటల రెస్క్యూ తర్వాత శవమై బయటకు రావడంతో..

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో శనివారం నాడు ఒకటిన్నర ఏళ్ల బాలిక బోరుబావిలో పడి 17 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ.. బోరుబావిలోనే చిక్కుకుపోయి మరణించింది. ఆరోహి అనే బాలిక శుక్రవారం సుర్గాపురా గ్రామంలోని వ్యవసాయ పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 45-50 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిపోయింది. ఆరోహి కుటుంబం వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), అమ్రేలి అగ్నిమాపక విభాగానికి చెందిన బృందం ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది. చిన్నారి ఊపిరి పీల్చుకోవడానికి బోర్‌వెల్‌లో ఆక్సిజన్ పైపులను పంపించారు. 17 గంటల తర్వాత, అపస్మారక స్థితిలో ఉన్న ఆరోహిని బయటకు తీయడంలో రెస్క్యూ టీమ్ విజయం సాధించింది. ఆరోగ్య శాఖ అధికారులు ఆరోహిని పరీక్షించి చనిపోయినట్లు ప్రకటించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story