దేశంలో మ‌రోమారు నాలుగు వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

India Corona Cases Today. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 15.73 ల‌క్ష‌ల‌ క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 2,81,386 పాజిటివ్ కేసులు న‌మోదు, 4,106 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.

By Medi Samrat  Published on  17 May 2021 5:24 AM GMT
India corona cases

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. కేసుల సంఖ్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికి.. మ‌ర‌ణాల సంఖ్య నాలుగు వేలు దాట‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 15.73 ల‌క్ష‌ల‌ క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 2,81,386 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది. నిన్న ఒక్క రోజే 4,106 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైనప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2.74 లక్షలకు చేరింది.

నిన్న 3,78,741 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 2,11,74,076కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 35,16,997 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశంలో టీకా డ్రైవ‌ర్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 18 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది.
Next Story
Share it