ఆ రెండు రాష్ట్రాల్లో తగ్గని కరోనా.. కేంద్ర సర్కార్‌ నుంచి ప్రత్యేక బృందాలు

To Win Battle Against COVID-19, Centre Rushes Help To Maharashtra, Kerala.కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టగా, మరి కొన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడి రాలేకపోతోంది. ఈ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి బృందాలను పంపాలని నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on  3 Feb 2021 2:46 AM GMT
entre Rushes Help To Maharashtra, Kerala.
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టగా, మరి కొన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడి రాలేకపోతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా అధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కేరళ. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకు వేలాల్లో కేసులు నమోదవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.


ఈ రెండు రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి బృందాలను పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర, కేరళ రాష్ట్ర అధికారులకు సహకారం అందించేందుకు రెండు ఉన్నత స్థాయి బృందాలను పంపనుంది కేంద్ర ప్రభుత్వం. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం, ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి చెందిన నిపుణుల బృందం మహారాష్ట్రకు, ఆరోగ్యశాఖలోని సీనియర్‌ అధికారులు, నిపుణులతో కూడిన మరో బృందం కేరళకు త్వరలో పంపించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖలతో కలిసి పని చేస్తాయని, క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు సిఫార్సులు చేస్తుందని తెలిపింది.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య అధికంగానే ఉంటోంది. అయితే ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల్లో దాదాపు 70 శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. దీంతో కేంద్ర సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అక్కడికి వెళ్లే కేంద్ర బృందాలు కరోనా తగ్గకపోవడానికి గల కారణాలను అన్వేషించనున్నాయి.




Next Story