ఉప ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన దీదీ

TMC fields Shatrughan Sinha from Asansol, Babul Supriyo to contest from Ballygunge. అసన్‌సోల్ లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగ‌నున్న‌ ఉప ఎన్నికకు తృణమూల్‌ కాంగ్రెస్..

By Medi Samrat  Published on  13 March 2022 2:42 PM IST
ఉప ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన దీదీ

అసన్‌సోల్ లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగ‌నున్న‌ ఉప ఎన్నికకు తృణమూల్‌ కాంగ్రెస్.. నటుడు, మాజీ కేంద్ర మంత్రి శత్రుఘ్న సిన్హాను అభ్యర్థిగా బ‌రిలోకి దించ‌నుంది. ఈ మేర‌కు పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు. అలాగే బాలిగంజ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బాబుల్‌ సుప్రియో ఎంపికయ్యారు. అసన్‌సోల్ లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గ ఉపఎన్నిక‌కు అభ్య‌ర్ధిగా మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాను అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా ప్రకటించడం సంతోషంగా ఉంది" అని టీఎంసీ బాస్ దీదీ ట్వీట్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ గాయకుడు బాబుల్ సుప్రియో బాలిగంజ్ నుండి విధానసభ ఉప ఎన్నికలో మా అభ్యర్థి. జై హింద్, జై బంగ్లా, జై మా-మతి- మనుష్! అంటూ దీదీ మ‌రో ట్వీట్ చేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పార్లమెంటరీ స్థానం బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంతో ఖాళీగా ఉంది. అలాగే.. రాష్ట్ర మంత్రి సుబ్రతా ముఖర్జీ మరణం తర్వాత బల్లిగంజ్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ నుండి సుప్రియో తొలగించడంతో.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటాన‌ని.. త్వరలో లోక్‌సభకు రాజీనామా చేస్తానని ప్రకటించారు. అనంతరం జేపీ నడ్డాతో భేటీ తర్వాత తాను పార్లమెంటేరియన్‌గా కొనసాగుతానని ప్రకటించారు. అయితే అనూహ్యంగా రాజీనామా చేసి గతేడాది జూలైలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సమక్షంలో టీఎంసీలో చేరారు.

ఇదిలావుంటే.. ఏప్రిల్ 12న ఒక లోక్‌సభ స్థానం, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జ‌రుగ‌నున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బల్లిగంజ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్, బీహార్‌లోని బోచాహాన్, మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్‌లకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.













Next Story