ఎదురు కాల్పులు... ముగ్గురు ఉగ్రవాదులు హతం

Three terrorists killed in encounter with security forces in Shopian.జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో పోలీసులకు,

By అంజి
Published on : 12 Oct 2021 4:00 AM

ఎదురు కాల్పులు... ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా హతమయ్యారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని కాశ్మీర్ జోన్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమర్చామని, అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని తెలిపారు. షోపియాన్‌లోని తుల్‌రాన్‌, ఇమామ్‌సహాబ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో హత‌మైన‌ ముగ్గురు లష్కరే తోయిబా రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ ఉగ్రవాదులు గందర్‌బల్‌ జిల్లాకు చెందినవారని ఇన్‌స్పెక్టర్‌ జనరల్ ఆఫ్‌ పోలీస్‌ కశ్మీర్‌ విజయ్ కుమార్ అన్నారు. ఒక ఉగ్రవాది గందర్‌బల్‌కు చెందిన ముఖ్తార్‌ షాగా గుర్తించిన‌ట్లు తెలిపారు.

నిన్న జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులైయ్యారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో పాటూ మరో నలుగురు సైనికులు మరణించారని భారత ఆర్మీ తెలిపింది. పీర్‌ పంజాల్‌ రేంజ్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు.

Next Story