ఆటో రిక్షాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

ఆటో రిక్షాలా థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. మోటార్‌ వెహికల్స్‌ రూల్స్‌ 2022లో సవరణలు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

By అంజి  Published on  9 Jan 2024 10:00 AM IST
third party insurance, auto rickshaws, e rickshaws, Central Govt

ఆటో రిక్షాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

ఆటో రిక్షాలా థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం మొత్తాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోటార్‌ వెహికల్స్‌ రూల్స్‌ 2022లో సవరణలు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనవరి 5 నాటి అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఆరు సీటర్‌ ఆటోలకు ప్రీమియం బేసిక్‌ రేట్‌ను రూ.2,539 నుంచి రూ.2,371కి తగ్గించింది. ఒక్కో ప్రయాణికుడిపై రూ.1,134 మించకూడదని స్పష్టం చేసింది. ఈ - రిక్షాల బేసిక్‌ థర్డ్‌ పార్టీ ప్రీమియాన్ని రూ.1648 నుంచి రూ.1539కి తగ్గించింది. ఒక్కో ప్రయాణికుడికి రూ.737కు పరిమితం చేసింది.

ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా మత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మోటారు వాహన చట్టాల ప్రకారం ప్రతి నమోదిత వాహనానికి యాక్టివ్ థర్డ్-పార్టీ బీమా కవర్ ఉండటం తప్పనిసరి. 2022లో జారీ చేసిన నిబంధనల ప్రకారం డీజిల్‌ లేదా గ్యాస్‌తో నడిచే ఆటో రిక్షాలు థర్డ్‌ పార్టీ ప్రీమియం కింద ఒక్కో ఆటోపై రూ.2,539, ఒక్కో ప్రయాణికుడిపై రూ.1,214 చెల్లించాలి. అదే ఈ-ఆటోలైతే ఒక్కో వాహనంపై రూ.1,648, ఒక్కో ప్రయాణికుడిపై రూ.789 థర్డ్‌ పార్టీ ప్రీమియంగా చెల్లించాల్సి వచ్చేది.

Next Story