టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్.. ఆ 5 రాష్ట్రాల్లోనే చాలా ఎక్కువట..!

black fungus high in five states of India. భారతదేశంలో ఎక్కువగా 5 రాష్ట్రాల్లోనే బ్లాక్ ఫంగస్ అధికంగా ఉందని తెలుస్తోంది..

By Medi Samrat  Published on  26 May 2021 6:22 PM IST
Black fungus

భారతదేశం సెకండ్ వేవ్ కరోనా మహమ్మారితో పోరాడుతూ ఉండగా.. మరో వైపు కొత్త ఫంగస్ లు టెన్షన్ పెడుతూ ఉన్నాయి. దేశంలో ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ పెరుగుతూ ఉండడాన్ని గమనించవచ్చు..! ఎక్కువగా 5 రాష్ట్రాల్లోనే బ్లాక్ ఫంగస్ అధికంగా ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్ లో 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 11,717 కేసులు నమోదయ్యాయి.

బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కోరుతున్నట్లుగా బ్లాక్ ఫంగస్ చికిత్సలో వినియోగించే మందులను ప్రాధాన్యతాక్రమంలో కేటాయించింది. మ్యూకోర్మైకోసిస్ చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను రాష్ట్రాలకు అందించింది కేంద్ర ప్రభుత్వం. మహారాష్ట్ర , ఢిల్లీ , యుపీ , ఏపీ లలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాలు యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్లను కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరాయి. 29 వేల 250 యాంఫోటెరిసిన్-బి వయల్స్ పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయిస్తూ మే 26న ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.


Next Story