ఎన్నికల్లో గెలుపొందిన ఏకైక ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి
The Only Transgender Candidate To Win Tamil Nadu Urban Local Bodies Election
By అంజి Published on 23 Feb 2022 5:51 PM ISTఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ అభ్యర్థి గెలుపొందారు. వెల్లూరు నుండి పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ గంగా నాయక్ మంగళవారం తమిళనాడులో చరిత్ర సృష్టించారు. ఎన్నిలకల్లో గెలిచిన మొదటి లింగమార్పిడి అభ్యర్థిగా ఆమె నిలిచారు. వెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లోని 37వ వార్డులో తమిళనాడు అధికార డీఎంకే పోటీ చేసిన 49 ఏళ్ల గంగా నాయక్ విజేతగా నిలిచారు. గంగ నాయక్ 20 సంవత్సరాలకు పైగా డిఎంకె సభ్యురాలు ఉన్నారు. సమాజం కోసం ఆమె చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది. గంగా నాయక్ 15 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆమెకు 2,131 ఓట్లు వచ్చాయి.
"ప్రజలు నా పట్ల వివక్ష చూపలేదు. నన్ను తమలో ఒకరిగా అంగీకరించారు" అని అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికలలో తన విజయం గురించి ఆర్. గంగ అన్నారు. తన విజయం గురించి ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్లకు ఇది పెద్ద అడుగు అని అన్నారు. "పార్టీ నన్ను పోటీకి నిలబెట్టినందుకు, ప్రజలు నాపై విశ్వాసం ఉంచినందుకు నేను కృతజ్ఞురాలిని. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా, మరింత మంది ట్రాన్స్ జెండర్‌లు ముందుకు వచ్చి సమాజాభివృద్ధికి కృషి చేసేలా ప్రోత్సహించాలి'' అని తన వార్డులోని ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించిన గంగమ్మ అన్నారు.