చావు బతుకుల మధ్య ఉన్న ఓ కన్న తల్లి కోరికను కూతురు నెరవేర్చింది. ఆస్పత్రిలోని ఐసీయూలో ఉన్న తన తల్లి ఎదుటే వివాహాం చేసుకుంది. ఈ ఘటన బీహార్‌లోని గయాలో జరిగింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తల్లి పూనమ్ కుమారి వర్మ.. తన కుమార్తెకు తన ఎదుటే పెళ్లి చేయాలనే కోరికను బంధువుల ముందు వ్యక్తం చేసింది. ఆ తర్వాత కూతురు చాందినీ కుమారి ఐసీయూలోనే తన తల్లి ఎదుట పెళ్లి చేసుకుంది. అయితే ఈ సంతోషం ఎంతో సేపూ నిలవలేదు. కుమార్తె వివాహం జరిగిన 2 గంటల తర్వాత తల్లి మరణించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐసీయూలో చేరిన పూనమ్ కుమారి వర్మ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో ఆర్ష్ ఆస్పత్రిలో చేర్పించారు, పరిస్థితి విషమంగా మారడంతో ఆమె ఎప్పుడైనా చనిపోవచ్చునని డాక్టర్ చెప్పారు. పూనమ్ కుమారి వర్మ కుమార్తె నిశ్చితార్థం డిసెంబర్ 26న జరగాల్సి ఉంది. కాగా, పూనమ్ కుమారి వర్మ పట్టుబట్టడంతో ఒకరోజు ముందుగానే నిశ్చితార్థం జరిగింది. తల్లి పూనమ్ కుమారి వర్మ కరోనా కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. తల్లి కోరిక మేరకు ఆమె కూతురు చాందినీ కుమారి, అల్లుడు ఇంజనీర్ సుమిత్ గౌరవ్‌లు ఆసుపత్రిలో పెళ్లి చేసుకున్నారు. ఇది చూసిన ఆసుపత్రి సిబ్బంది ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి సంతోషంతో పాటు కుటుంబంలో శోకసంద్రం నెలకొంది.