ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు జవాన్లు మృతి

The bus plunged into the river.. Six ITBP personnel were killed

By అంజి  Published on  16 Aug 2022 1:35 PM IST
ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు జవాన్లు మృతి

జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పహల్గామ్‌లోని ఫ్రిస్లాన్‌ చందన్వారి రోడ్డులో ప్రయాణిస్తుండగా భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో బస్సు పక్కనే ఉన్న నదిలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. చాలా మంది సైనికులకు తీవ్రగాయాలయ్యాయి. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారికి చికిత్స నిమిత్తం శ్రీనగర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 37 మంది ఐటీబీపీ, ఇద్ద‌రు క‌శ్మీర్ పోలీసులు ఉన్నారు. బ్రేక్‌లు ఫెయిల్‌ కావడంతో బస్సు నదిలోకి దూసుకెళ్లింది. అమ‌ర్‌నాథ్ యాత్ర వ‌ద్ద విధులు నిర్వ‌ర్తిస్తున్న జ‌వాన్లు ఆ బ‌స్సులో ఉన్నారు. చంద‌న్‌వారి నుంచి పెహ‌ల్గామ్‌కు భ‌ద్ర‌తా ద‌ళాలు ప్ర‌యాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐటీబీపీ ఉన్నతాధికారులు తెలిపారు.




Next Story