ప్రధాని పేరు చెప్పలేదని.. వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకున్న వధువు

మన దేశ ప్రధాని పేరు చెప్పలేదన్న కారణంతో.. వధువు వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని

By అంజి
Published on : 21 Jun 2023 8:45 AM IST

bride married, groom younger brother, Uttar Pradesh, Ghazipur

ప్రధాని పేరు చెప్పలేదని.. వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకున్న వధువు

మన దేశ ప్రధాని పేరు చెప్పలేదన్న కారణంతో.. వధువు వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘాజీపూర్‌ జిల్లాలో వెలుగు చూసింది. జరిగిన పెళ్లిని కాదని.. పెళ్లి కొడుకు తమ్ముడిని వివాహం చేసుకుంది. ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘాజీపూర్‌ జిల్లాలోని సైదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నారాసిపూర్‌ గ్రామానికి చెందిన శివ శంకర్‌ (27)కు జూన్ 11న బసంత్‌ పట్టి గ్రామానికి చెందిన రంజన అనే యువతితో పెళ్లి జరిగింది. 6 నెలల కిందట వీరి వివాహం నిశ్చయమైంది. అప్పటి నుంచి వారు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. జూన్‌ 12వ తేదీన వారింట్లో పెళ్లి తర్వాతి కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో శివశంకర్‌.. తన మరదలు, బావమరిదితో మాటలు కలిపాడు.

ఈ క్రమంలోనే మరదలు సరదాగా ప్రశ్నలు అడిగింది. ఉన్నట్టుండి మరదలు, బావమరిది.. మన దేశ ప్రధాని పేరు చెప్పాలని వరుడిని అడిగారు. మరదలి ప్రశ్నకు శివశంకర్‌ సమాధానం చెప్పలేక తడబడ్డాడు. ఇది చూసిన వధువు బంధువుల అతడిని హేళన చేయసాగారు. అతనిది మందబుద్ధిగా భావించారు. దీన్ని వధువు తీవ్ర అవమానంగా భావించింది. అక్కడికక్కడే శివ శంకర్‌తో జరిగిన పెళ్లిని రద్దు చేసుకుని.. అతడి తమ్ముడైన అనంత్‌ను రంజన వివాహం చేసుకుంది. రంజనా అనంత్‌ కంటే పెద్దది. వధువుతో చిన్న కొడుకును కాపురానికి పంపడానికి మామ అభ్యంతరం తెలిపాడు. ఈ విషయమై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Next Story