ట్యూషన్‌ టీచర్‌తో ప్రేమ.. ఆన్‌లైన్‌ ఆర్డర్లతో వేధింపులు!

చెన్నైలో ట్యూషన్‌ టీచర్‌(22)తో ప్రేమలో పడ్డాడు 17 ఏళ్ల బాలుడు. ఇటీవల ఆమె అతడిని దూరం పెట్టడంతో పగ పెంచుకున్నాడు.

By అంజి  Published on  25 July 2024 10:18 AM IST
tuition teacher, cash on delivery orders, love, Chennai, tamilnadu

ట్యూషన్‌ టీచర్‌తో ప్రేమ.. ఆన్‌లైన్‌ ఆర్డర్లతో వేధింపులు!

చెన్నైలో ట్యూషన్‌ టీచర్‌(22)తో ప్రేమలో పడ్డాడు 17 ఏళ్ల బాలుడు. ఇటీవల ఆమె అతడిని దూరం పెట్టడంతో పగ పెంచుకున్నాడు. ఆమపై వినూత్న రీతిలో వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ఇంటికి వందలాది క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్లు, 77 ఓలా, ఉబర్‌ రైడ్స్‌ బుక్‌ చేశాడు. వచ్చిన వారికి సమాధానం చెప్పుకోలేక యువతి కుటుంబం ఉక్కిరిబిక్కిరైంది. ఇది చూసి రాక్షసానందం పొందాడు. దీనిపై వారు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని పట్టుకున్నారు. అతనికి కౌన్సిలింగ్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

తెలియని ఫోన్ నంబరు నుంచి ఎవరో తమ కూతురిని వేధిస్తున్నారంటూ ఈ నెల 2వ తేదీన పెరియామెట్ పట్టణానికి ఓ వ్యక్తి కలిసి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురికి తెలియని నంబరు ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్డ్, స్విగ్గీల నుంచి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ ఇంటికి ఏవేవో వస్తువులను పంపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఫోన్​ నెంబర్ ఈ మెయిల్ ఆధారంగా అతడిని అరెస్ట్ చేశారు.

నిందితుడైన 17 అబ్బాయిని విచారించగా.. యువతి దగ్గరకే ఆ బాలుడు ట్యూషన్​కు వెళ్లేవాడని చెప్పాడు. ట్యూషన్‌ టైంలోనే తామిద్దరం ప్రేమలో పడ్డామని చెప్పాడు. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిశాక, ఆమె తనతో మాట్లాడటం మానేసిందని, దూరంగా ఉండటం మొదలుపెట్టిందని చెప్పాడు. అందుకే కోపమొచ్చి వేధించడం మొదలుపెట్టానని బాలుడు వివరించాడు. కాగా బాలుడి దగ్గర నుంచి 2 సెల్‌ఫోన్లను, వైఫై రూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ చేయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Next Story