తగ్గనున్న ట్యాక్స్‌.. కేంద్ర బడ్జెట్‌ ప్లాన్‌ ఇదేనా

ఇటీవల కేంద్రంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం 2024 - 25 బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. దీంతో ప్రజలందరి దృష్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ మీదనే ఉంది.

By అంజి  Published on  1 July 2024 10:00 AM GMT
Central government, new budget, budget, Tax

తగ్గనున్న ట్యాక్స్‌.. కేంద్ర బడ్జెట్‌ ప్లాన్‌ ఇదేనా

ఇటీవల కేంద్రంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం 2024 - 25 బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. దీంతో ప్రజలందరి దృష్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ మీదనే ఉంది. గతంలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఇప్పుడు నిర్మల సీతారామన్‌ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ట్యాంక్స్‌లు తగ్గనున్నట్టు సమాచారం. ట్యాక్స్‌లతో పాటు మరికొన్ఇన ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయట. అవేంటే ఇప్పుడు చూద్దాం..

రానున్న బడ్జెట్‌లో సంవత్సరానికి రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్య సంపాదించే మధ్య తరగతి ప్రజల ఆదాయ పన్ను రేట్లను తగ్గించనున్నట్టు సమాచారం. భారతదేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ సవాళ్లను పరిష్కరించడం, ఉద్యోగాల కల్పన, మూలధన వ్యయాలను నిలబెట్టుకోవడం, ఆర్థిక ఏకీకరణను కొనసాగించడానికి ఆదాయ వృద్ధిని పెంచడం రాబోయే బడ్జెట్‌లో కీలక అంశాలుగా ఉండనున్నాయట.

Next Story