అంబానీ ఫ్యామిలీకి ఈ హెచ్చరికలు ఏమిటో..?
Terror Outfit Claims Responsibility For Explosive-Laden SUV Outside Ambani's Residence. ఆసియా కుబేరుడిగా ముఖేశ్ అంబానీ మరోసారి నిలిచాడు.
By Medi Samrat Published on 28 Feb 2021 10:37 AM GMTఆసియా కుబేరుడిగా ముఖేశ్ అంబానీ మరోసారి నిలిచాడు. చైనాకు చెందిన ఝోంగ్ షన్షాన్ ను వెనక్కు నెట్టి ఆసియాలో అత్యంత ధనికుడిగా అవతరించారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. ఝోంగ్ కు చెందిన బాటిల్డ్ వాటర్ కంపెనీ 20 శాతం మేర నష్టపోవడంతో.. దాదాపు 2,200 కోట్ల డాలర్ల నష్టం కలిగింది. దీంతో అంబానీ మొదటి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం 8 వేల కోట్ల డాలర్లతో ఆసియా కుబేరుడిగా అంబానీ నిలిచారు.
ఓ వైపు ఆసియాలోనే అత్యంత ధనికుడిగా నిలిచినప్పటికీ.. మరో వైపు కొందరు చేస్తున్న హెచ్చరికలు అంబానీ కుటుంబాన్ని.. ముంబై పోలీసులను టెన్షన్ పెడుతున్నాయి. ముంబైలోని ముఖేష్ నివాసం ఆంటిలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఇక ఆంటిలియా ముందు కారులో బాంబులు పెట్టింది తామేనని జైషుల్ హింద్ అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది.
మేం ఎవరని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు.. మేం మీ పీడకలలం. మీ చుట్టుపక్కనే ఉన్నాం.. మీ ఆఫీసులో పనిచేస్తున్నాం. ఓ మామూలు మనిషిలా మీ పక్కనే ఉన్నామని కూడా తెలిపారు. మీ పక్క నుంచే వెళ్లే బిచ్చగాడిలా ఉన్నాం. ప్రతి చోటా మేమున్నాం. బీజేపీ, ఆరెస్సెస్ కు అమ్ముడు పోయిన మీ లాంటి వ్యాపార వ్యభిచారులతోనే మాకు పెద్ద సమస్య అని చెప్పారు. టెలీగ్రామ్ యాప్ ద్వారా సందేశం పంపారు. ఇది కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించింది. బిట్ కాయిన్లలో డబ్బులు పంపించాలి.. లేదంటే నీతా వదినా.. ముకేశ్ అన్నా.. ఈసారి బాంబులున్న కారు మీ పిల్లల కారుపైకి దూసుకెళ్తుంది.. దమ్ముంటే మమ్మల్ని ఆపండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు.