యూపీ జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా తెలుగు మ‌హిళ

Telugu woman elected in Uttar Pradesh Parishad Elections.దక్షిణాదివారంటే చాలు ఉత్తరాది వారికి కాస్తంత చిన్నచూపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2021 6:03 AM GMT
యూపీ జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా తెలుగు మ‌హిళ

దక్షిణాదివారంటే చాలు ఉత్తరాది వారికి కాస్తంత చిన్నచూపు అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది.. ఉత్తరాదిన జరిగిన స్థానిక ఎన్నికల్లో దక్షిణాదికి చెందిన ఒక మహిళ విజయం సాధించటం.. కీలక స్థానాన్ని సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో కీసర శ్రీకళారెడ్డి తన సత్తా చాటారని చెప్పాలి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్‌లోని జన్పూర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా భారతీయ జనతా పార్టీ( బీజేపీ) నుంచి ఎన్నికయ్యారు.

మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె అయిన శ్రీకళారెడ్డి యూపీలో స్థిరపడ్డారు. గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో తన తండ్రి గారి తరఫున చురుకుగా పాల్గొన్న శ్రీకళారెడ్డికి యూపీకి చెందిన ధనుంజయ్‌తో వివాహమైంది. అనంతరం బీజేపీలో చేరారు. ఇటీవల అక్కడ జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీచేసి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జాన్పూర్‌ పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఎట్టకేలకు జాన్పూర్ పరిషత్ ను సొంతం చేసుకోగలిగారు. ఒక తెలుగుమ్మాయిగా సవాళ్లతో కూడుకున్న రాజకీయ రంగంలో రాష్ట్రం కాని రాష్ట్రంలో విజయం సాధించిన తన సత్తాను చాటుకోవటం నిజంగా అభినందించాల్సిన విషయమే.

Next Story
Share it