చెన్నై నుంచి హైదరాబాద్ బయల్దేరిన స్పైస్ జెట్ విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్లైట్‌లో సమస్యను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి చెన్నైలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. సుమారు 2 గంటలుగా ప్రయాణికులంతా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నారు. ఫ్లైట్‌కు సంబంధించి అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలంటూ మండిపడుతున్నారు.
కాగా రెండు రోజుల క్రితమే గోవా - పుణే స్పైస్ జెట్ విమానం గాల్లో ఉండగానే కిటికీ ఫ్రేమ్ ఊడటం కలకలం రేపింది. ఇదిలా ఉంటే.. గత నెల అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI171, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ లోని మేఘ్ నగర్ ప్రాంతంలో కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 270 మందికిపైగా మృతి చెందారు.