విద్యార్థిని చావబాదిన టీచర్‌.. వీడియో వైరల్.!

Teacher beats student Video goes viral. క్లాస్‌కి సరిగా రావడం లేదని 12వ తరగతి విద్యార్థిని చావబాదాడు ఓ టీచర్. తరగతి గదిలో అందరూ

By అంజి  Published on  14 Oct 2021 11:01 AM GMT
విద్యార్థిని చావబాదిన టీచర్‌.. వీడియో వైరల్.!

క్లాస్‌కి సరిగా రావడం లేదని 12వ తరగతి విద్యార్థిని చావబాదాడు ఓ టీచర్. తరగతి గదిలో అందరూ విద్యార్థుల ముందు ఓ విద్యార్థిని కాళ్లతో తంతూ, కట్టెతో ఎక్కడ పడితే అక్కడ కొడుతూ హింసించాడు. తాను చేసిన తప్పును మరోసారి చేయనని విద్యార్థి ఎంత ప్రాధేయపడ్డ టీచర్ ఏ మాత్రం కనికరించలేదు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా పరిధిలో జరిగింది. విద్యార్థిని కొడుతున్న సమయంలో... అదే తరగతిలో ఉన్న మరో విద్యార్థి ఈ ఘటన తన ఫోన్‌లో చిత్రీకరించాడు. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ కావడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్‌ స్కూల్‌లో 12వ తరగతి చదువున్న ఆ విద్యార్థి రెగ్యులర్‌గా క్లాసులకు రావట్లేదని, అందుకే టీచర్‌ చావబాదాడని సమాచారం.

ఈ ఘటనపై ఎంపీ కార్తీ చిదంబరం స్పందిస్తూ... ఇలా కొట్టి హింసించడం కరెక్ట్‌ కాదు.. ఆ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. కాగా ఈ సంఘటనపై కడలూరు జిల్లా కలెక్టర్ కె.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని, విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థి మొదటి క్లాస్‌కు హాజరయ్యాడని, ఆ తర్వాత జరిగిన ఫిజిక్స్‌ క్లాసు లేడని కలెక్టర్ తెలిపారు. ఘటన జరిగిన స్కూల్‌లో 6 నుండి 12వ తరగతి వరకు 500 మంది విద్యార్థులు చదువుతున్నారు.


Next Story
Share it