ఘోర ప్రమాదం.. ఏడుగురు మహిళలు దుర్మరణం
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 11 Sep 2023 10:27 AM GMTఘోర ప్రమాదం.. ఏడుగురు మహిళలు దుర్మరణం
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరికొందరికి తీవ్రగాయాలు కాగా.. వారిని అధికారులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయిస్తున్నారు.
ఈ నెల 8న తమిళనాడులోని వెల్లూరు జిల్లాకు చెందిన 24 మంది పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఓ మినీ వ్యాన్‌లో కర్ణాటక వెళ్లారు. ఇక మూడ్రోజుల పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తర్వాత తిరిగి.. తమిళనాడుకు పయనం అయ్యారు. సోమవారం తెల్లవారుజామున బెంగళూరు-చెన్నై రహదారిపై ఆగిపోయింది. ఎంతకీ స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత ఆ వాహనాన్ని ఉదయం 3 గంటలకు అలా తిరుపత్తూరు జిల్లా నట్రంపల్లి శివారులో పార్క్ చేశారు. ఆ వాహనానికి మరమ్మతులు ప్రారంభించారు. అయితే.. బస్సులోని మహిళలు కొందరు కిందకు దిగి రోడ్డుపక్కనే కూర్చొన్నారు. అంతలోనే యుముడి రూపంలో ఓ లారీ దూసుకొచ్చింది. మరమ్మతులు జరుగుతున్న వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. దాంతో.. ఆ వాహనం రోడ్డుపై కూర్చొన్న మహిళలపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఏడుగురు మహిళలు అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయారు. మినీ బస్సు వారి మీదనుంచి దూసుకెళ్లడంతో మృతదేహాలన్నీ చితికిపోయాయి. మరో 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. అయితే.. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికితరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుబాలకు రూ.లక్ష చొప్పున,.. క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. ఇక మృతులందరినీ గుర్తించామని.. వారి వారి బంధువులకు మృతదేహాలను అప్పగించినట్లు తెలిపారు.