విద్యార్థుల‌కు శుభ‌వార్త‌‌.. రోజుకు 2జీబీ డాటా ఉచితం

Tamil Nadu Government to provide 2GB Data free to students.క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్య‌మా అని ఈ విద్యా సంవ‌త్స‌రం ఆన్‌లైన్‌లో క్లాస్సేస్, కాబట్టి విద్యార్థుల‌కు శుభ‌వార్త‌‌.. రోజుకు 2జీబీ డాటా ఉచితం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2021 4:34 PM IST
Tamilnadu scheme

క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్య‌మా అని ఈ విద్యా సంవ‌త్స‌రం చాలా ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. ఈ వైర‌స్ సోకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉండ‌డంతో.. విద్యార్థులను వారి త‌ల్లిదండ్రులు పాఠ‌శాల‌ల‌కు పంప‌డం లేదు. దీంతో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్ అన‌ని ఆన్‌లైన్‌లో విద్యార్థుల‌కు పాఠాలు బోదిస్తున్నారు. దీంతో ప్రతీ ఒక్క విద్యార్థికి ల్యాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ దానికి ఇంటర్నెట్ అనివార్యమయ్యాయి. రోజు వారీ కూలీకి వెళ్తేకానీ ఇల్లు గడవని కుటుంబాలకు ఇది ఇబ్బంది కరంగా మారింది. ఎలాగోలా క‌ష్ట‌ప‌డి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసినా.. దానికి ప్ర‌తి నెలా డేటా బ్యాలెన్స్ వేయ‌డం ఇబ్బందిక‌రంగా మారింది. ఈ ఇబ్బందుల‌ను గ‌మ‌నించిన ప్ర‌భుత్వం.. విద్యార్థుల‌కు ప్ర‌తి రోజు 2 జీబీ చొప్పున ఉచితంగా డేటా ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చింది. అయితే.. ఇది మ‌న తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. ప‌క్క‌నే ఉన్న త‌మిళ‌నాడులో.

విద్యార్థులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళని స్వామి శుభవార్త చెప్పారు. రోజూ 2జీబీ డేటా ఉచితంగా అందివ్వనున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ ఉచిత డేటాను వినియోగించుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా 9.69లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. దీంతో వారంతా ఆన్‌లైన్ లో క్లాసులు వినొచ్చున‌ని ఎటువంటి ఇబ్బంది ఉండ‌ద‌ని ఆయ‌న చెప్పారు. విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు వినే సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. రోజుకు 2 జీబీ చొప్పున జనవరి నుంచి ఏప్రిల్ వరకు డాటా అందిస్తాం. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుతున్న 9,69,047 మంది విద్యార్థులకు ఉచిత డేటా కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది' అని సీఎం పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డేటా కార్డులన్నీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ (ELCOT) ద్వారా సరఫరా చేయబడతాయి.


Next Story