ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించిన సీఎం

Tamil Nadu CM Stalin travels in MTC bus and interacts with passengers.త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసిన నాటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2022 6:49 AM GMT
ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించిన సీఎం

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసిన నాటి నుంచి స్టాలిన్ ప‌రిపాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. త‌న దైన నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల హృద‌యాల‌కు చేరువ అవుతున్నారు. పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చేరుతున్నాయా..? లేదా అనేది తెలుసుకునేందుకు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే వెళ్లి వారిని అడిగితెలుసుకుంటున్నారు. వారికి ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే వెంట‌నే పరిష్క‌రిస్తున్నారు. ఇక ఆయ‌న సీఎంగా ప్ర‌యాణం చేసి నేటికి ఏడాది పూర్తి అయ్యింది.

ఈ క్ర‌మంలో స్టాలిన్ ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించారు. మెరీనా బీచ్ వ‌ర‌కు బ‌స్సులో నిల‌బ‌డి ఓ సాధార‌ణ వ్య‌క్తిలా ప్ర‌యాణం చేశారు. ప్రయాణికులు, కండక్టర్ తో మాట్లాడారు. సిటీ బస్సుల్లో ప్రయాణికులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఏడాది క్రితం ప్రభుత్వం బస్సుల్లో కల్పించిన మౌలిక వసతులు, ఫిట్ నెస్ పై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కాగా.. స్టాలిన్ ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించడం ఇదే తొలిసారి కాదు. ఇంత‌క‌ముందు కూడా ఆయ‌న ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించారు.

ఇక‌.. మెరీనా బీచ్‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రి స్టాలిన్‌.. మాజీ సీఎం క‌రుణానిధి స్మార‌కం వ‌ద్ద నివాళి అర్పించారు. డీఎంకే వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ సీఎం అన్నాదురై మెమోరియ‌ల్ వ‌ద్ద పుష్ప‌గుచ్ఛంతో నివాళి అర్పించారు. ఆ త‌ర్వాత అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ అయిదు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అందులో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఒక‌టి నుంచి 5వ త‌ర‌గ‌తి పిల్ల‌ల కోసం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ఒకటి. స్కూల్స్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌, మెడిక‌ల్ చ‌క‌ప్‌, ప‌ట్ట‌ణ కేంద్రాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుపై ప్ర‌క‌ట‌న చేశారు.

Next Story