తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ క‌న్నుమూత‌

ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ ఆదివారం కన్నుమూశారు. ఆరోగ్యం విషమించడంతో వారం రోజుల క్రితం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చేర్చారు.

By Kalasani Durgapraveen
Published on : 15 Dec 2024 9:30 PM IST

తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ క‌న్నుమూత‌

ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ ఆదివారం కన్నుమూశారు. ఆరోగ్యం విషమించడంతో వారం రోజుల క్రితం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చేర్చారు. జకీర్ గుండె సంబంధిత సమస్యలతో శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలోని ఐసియులో చేరారని ఆయ‌న‌ స్నేహితుడు, ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియా చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.

73 ఏళ్ల సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారని హుస్సేన్ సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. 'గుండె సంబంధిత సమస్య కారణంగా గత వారం రోజులుగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు' అని ఆయన చెప్పారు.

అంత‌కుముందు చవ్రాసియా పిటిఐతో మాట్లాడుతూ.. 'జాకీర్ అనారోగ్యంతో ఉన్నారు.. ప్రస్తుతం ఐసియులో ఉంచారు. ఆయ‌న‌ పరిస్థితిపై మేమంతా ఆందోళన చెందుతున్నామ‌ని అన్నారు.

Next Story