మద్యం డెలివరీ ప్రారంభించే యోచనలో స్విగ్గీ, జొమాటో
స్విగ్గీ, జొమాటో, బిగ్‌బాస్కెట్ వంటి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు త్వరలో బీర్, వైన్, లిక్కర్‌ల వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్‌ని త్వరలో డెలివరీ చేయడం ప్రారంభించవచ్చు.
By అంజి Published on 16 July 2024 7:02 AM GMTమద్యం డెలివరీ చేసే ఆలోచనలో స్విగ్గీ, జొమాటో
స్విగ్గీ, జొమాటో, బిగ్‌బాస్కెట్ వంటి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు త్వరలో బీర్, వైన్, లిక్కర్‌ల వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్‌ని త్వరలో డెలివరీ చేయడం ప్రారంభించవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ సహా పలు రాష్ట్రాలు ఈ చొరవ కోసం పైలట్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నాయని ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ తెలిపారని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మద్యం డెలివరీలను అనుమతించడం వల్ల లాభనష్టాలను అధికారులు అంచనా వేస్తున్నారని వారు వెల్లడించారు.
2020లో స్విగ్గీ, జొమాటో తమ ప్రధాన వ్యాపారం గణనీయంగా ప్రభావితమైనప్పుడు కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తమ సేవలను వైవిధ్యపరచడానికి మెట్రోయేతర ప్రాంతాల్లో ఆన్‌లైన్ ఆల్కహాల్ డెలివరీని ప్రారంభించాయి. జార్ఖండ్ ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత స్విగ్గీ తన ఆల్కహాల్ డెలివరీ సేవను రాంచీలో ప్రారంభించింది. జొమాటో దీనిని అనుసరించి.. రాంచీలో ప్రారంభించింది. జార్ఖండ్‌లోని మరో ఏడు నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది.
రెండు కంపెనీలు కూడా తమ సేవలను పొడిగించడానికి ప్రధాన మెట్రోలలోని అధికారులతో చర్చలు జరుపుతున్నాయి, అయితే అనుమతులు కొన్ని వారాల నుండి ఒక నెల వరకు పట్టవచ్చని భావిస్తున్నారు. స్విగ్గీ ఒడిశాలోని నగరాలకు విస్తరించాలని కూడా ప్లాన్ చేసింది. అయితే అంఫాన్ తుఫాను కారణంగా పాజ్ చేయాల్సి వచ్చింది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే మద్యం ఇళ్లకు డెలివరీ చేయడానికి అనుమతి ఉందని నివేదిక పేర్కొంది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాంలలో COVID-19 లాక్‌డౌన్ సమయంలో మద్యం డెలివరీలకు తాత్కాలిక ఆమోదం పరిమితులు ఉన్నప్పటికీ విజయవంతమైంది. రిటైల్ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం, ఆన్‌లైన్ డెలివరీల ఫలితంగా పశ్చిమ బెంగాల్, ఒడిశాలో అమ్మకాలు 20-30% పెరిగాయి.
ఆన్‌లైన్ డెలివరీ మోడళ్ల ప్రయోజనాలను స్విగ్గీలో కార్పొరేట్ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ డింకర్ వశిష్ హైలైట్ చేశారు. ఇది ఎండ్-టు-ఎండ్ లావాదేవీల రికార్డులు, వయస్సు ధృవీకరణ, పరిమితులకు కట్టుబడి ఉండేలా చూస్తుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాలు మద్యం డెలివరీ పైలట్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నందున, ఈ కార్యక్రమాల విజయం భారతదేశం అంతటా విస్తృత ఆమోదం, అమలుకు దారితీయవచ్చు.