ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గురు ప్రీత్ గోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
By Knakam Karthik Published on 11 Jan 2025 9:53 AM ISTఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గురు ప్రీత్ గోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన బుల్లెట్ గాయాలతో చనిపోయారు. పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే గోగీకి బుల్లెట్ గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఆయన తలలో రెండు బుల్లెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో గోగి తన గదిలో ఒంటరిగా ఉన్నాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన గురు ప్రీత్ గోగీ లుథియానా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పంజాబ్ మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్ భూషణ్‌ను 7 వేల ఓట్లకు పైగా తేడాతో ఓడించారు. గన్ ఫైర్ ఘటనకు ముందు గోగీ తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టారు. పంజాబ్‌లోని మాల్వాలోని బుద్ధ నాలాను శుభ్రం చేసే ప్రక్రియలో భాగంగా పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్, పర్యావరణ వేత్త సంత్ బాబా సీచ్వాలతో సమావేశం నిర్వహించినట్లు పోస్టు చేశారు.
అదే విధంగా బీఆర్‌ఎస్ నగర్‌లోని ప్రచీన్ షీత్లా మాత మందిర్‌లో 40 లక్షల రూపాయల విలువైన నగలు చోరీకి గురైతే ఆ టెంపుల్‌ను విజిట్ చేసినట్లు రాసుకొచ్చారు. దోషులకు శిక్షిస్తామని ఆలయ పూజారి, నిర్వాహకులకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీస్ కమిషనర్‌తో మాట్లాడానని, త్వరగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తన ఫేస్ బుక్ పేజీలో రాశారు.