కొత్త‌ సీఈసీగా సుశీల్‌చంద్ర

Sushil Chandra will replace Sunil Arora as the Chief Election Commissioner of India. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గా సుశీల్‌చంద్ర నియమితులయ్యారు.

By Medi Samrat  Published on  13 April 2021 3:58 AM GMT
Sushil Chandra

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గా సుశీల్‌చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోరా పదవీకాలం సోమవారంతో ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త సీఈసీగా సుశీల్‌ చంద్ర మంగళవారం బాధ్యతలు స్వీకరిస్తారని న్యాయశాఖ తెలిపింది. సుశీల్‌ చంద్ర ఈ పదవిలో వచ్చే ఏడాది మే 14 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక‌ సుశీల్‌ చంద్ర ప‌ద‌విలో కాలంలో గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.


Next Story
Share it