ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక డేటా తొలగించొద్దు..ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారంటూ సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.

By Knakam Karthik  Published on  11 Feb 2025 6:46 PM IST
ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక డేటా తొలగించొద్దు..ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారంటూ సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలలో డేటాను తొలగించరాదంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఈ పిటిషన్‌పై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈవీఎంలలో డేటాను తొలగించకూడదు, కొత్త జోడించకూడదు, వాటిని పరిశీలించాల్సి ఉందని తెలిపింది. అలాగే ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో..తెలియజేస్తూ, 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

మరో వైపు..ఈవీఎం-వీవీ ప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై దాఖలై పిటిషన్లను గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి విదితమే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలని దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్‌ను సీల్ చేయాలని ఆదేశించింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపర్చాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోగా తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది.

Next Story