సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్..!
హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. బార్ అండ్ బెంచ్ ప్రకారం.. ఈ రోజు హ్యాకర్లు సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేశారు
By Medi Samrat Published on 20 Sept 2024 1:59 PM ISTహ్యాకర్లు రెచ్చిపోతున్నారు. బార్ అండ్ బెంచ్ ప్రకారం.. ఈ రోజు హ్యాకర్లు సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేశారు. క్రిప్టోకరెన్సీ XRP కి చెందిన ప్రకటన వీడియో.. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్‌లో కనిపించింది. హ్యాకర్లు ఛానెల్‌లో 'బ్రాడ్ గార్లింగ్స్ హౌస్: XRP ధర అంచనా.. SEC యొక్క $2 బిలియన్ల జరిమానాకు తరంగాలు ప్రతిస్పందిస్తాయి! అని ప్రకటన కింద రాసి ఉంది.
సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్‌లో.. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇటీవల ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన అత్యాచారం, హత్య కేసులో సూమోటో పిటిషన్‌పై విచారణ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. హ్యాకర్లు మునుపటి వీడియోలను ప్రైవేట్‌గా చేసి.. క్రిప్టోకరెన్సీ XRP ప్రకటనను పబ్లిక్‌లో ఉంచారు. అయితే వీడియోను ప్లే చేస్తే ఏమీ కనిపించలేదు.
యూట్యూబ్‌కి వెళ్లి సుప్రీం కోర్ట్ అని వ్రాసి ఛానెల్ కోసం క్లిక్ చేస్తే.. ఆ పేజీ అందుబాటులో లేదు. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్‌కు రెండు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
స్కామర్లు రిపుల్, దాని CEO బ్రాడ్ గార్లింగ్‌హౌస్ పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ స్కామర్‌లు మోసం చేసేందుకు హ్యాక్ చేసిన YouTube ఖాతాలను ఉపయోగిస్తున్నారు. అది కూడా ఎక్కువ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ప్రసిద్ధ యూట్యూబ్ ఛానల్‌లు కావడం విశేషం.
స్కామర్లు ఈ ఖాతాల నుండి వీడియోలను పోస్ట్ చేసి.. XRPలో భారీ లాభాలు ఉన్నాయంటూ వాగ్దానం చేసి ప్రజల నుంచి డబ్బును దోపిడీ చేసేందుకు వల పన్నుతారు. ఇవే రిపుల్ నిజమైన ఖాతాలని భావించి ప్రజలు కూడా మోసపోతారు.
ది వెర్జ్ కథనం ప్రకారం.. గత కొన్ని నెలలుగా ఈ స్కామ్ జరుగుతోంది. స్కామర్లు చిన్న చిన్న మొత్తాల ప్రారంభ పెట్టుబడులతో XRPలో భారీ రాబడితో ప్రజలను ఆకర్షిస్తారు. చాలా మంది ప్రజలు వీటి మాయలో పడి తమ డబ్బును కోల్పోతారు.
యూట్యూబ్ ఛానెల్ హ్యాకింగ్‌పై ప్రస్తుతం సుప్రీంకోర్టు అధికార విభాగం దర్యాప్తు చేస్తోందని అధికారిక వర్గాలు బార్ & బెంచ్‌కి తెలిపాయి.