చెక్కుల తిరస్కరణ కేసులపై సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు

చెక్కులు బౌన్స్‌ అయిన కేసులపై కాంపౌండింగ్ (అప్పగింత) సంబంధిత మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సవరించింది

By -  Knakam Karthik
Published on : 26 Sept 2025 1:05 PM IST

National News, Supreme Court, cheque bounce cases, new guidelines

చెక్కుల తిరస్కరణ కేసులపై సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు

ఢిల్లీ: చెక్కులు బౌన్స్‌ అయిన కేసులపై కాంపౌండింగ్ (అప్పగింత) సంబంధిత మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సవరించింది. Damodar S. Prabhu vs Sayed Babalal H తీర్పులో ఇచ్చిన మార్గదర్శకాలను ‘ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గడం, ఇంకా వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం’ దృష్ట్యా తిరిగి పరిశీలించి సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ NV అంజారియా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ Sanjabij Tari Vs Kishore S. Borkar and another 2025 LiveLaw (SC) 952 కేసులో ఈ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.

సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు:

(a) నిందితుడు తన డిఫెన్స్ ఎవిడెన్స్ రికార్డు కావడానికి ముందే చెక్ అమౌంట్ చెల్లిస్తే, కోర్టు ఎటువంటి జరిమానా లేకుండా కాంపౌండింగ్ అనుమతించాలి.

(b) ఎవిడెన్స్ రికార్డు అయిన తరువాత కానీ తీర్పు వెలువడకముందు చెల్లిస్తే, చెక్ అమౌంట్‌పై 5% అదనంగా లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలి.

(c) సెషన్స్ కోర్టు లేదా హైకోర్టు ముందు చెల్లిస్తే, చెక్ అమౌంట్‌పై 7.5% అదనంగా కాస్ట్ చెల్లించాలి.

(d) సుప్రీంకోర్టు ముందు చెల్లిస్తే, చెక్ అమౌంట్‌పై 10% అదనంగా చెల్లించాలి.

అలాగే, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ లేదా కంప్లైనెంట్ చెక్ అమౌంట్ కాకుండా ఇతర బకాయిలు/రుణం మొత్తం వసూలు చేయాలని పట్టుబడితే, మేజిస్ట్రేట్ నిందితుడికి గిల్టీ ప్లీ చేయమని సూచించవచ్చని, ఆ సందర్భంలో CrPC సెక్షన్ 255(2), 255(3) లేదా BNSS 2023 సెక్షన్ 278 కింద శిక్ష విధించవచ్చని, అవసరమైతే Probation of Offenders Act, 1958 ప్రయోజనం కూడా ఇవ్వవచ్చని బెంచ్ స్పష్టం చేసింది.

గత మార్గదర్శకాలు (Damodar Prabhu కేసు, 2010): మొదటి లేదా రెండవ విచారణలో కాంపౌండింగ్ చేస్తే: జరిమానా లేదు. మేజిస్ట్రేట్ కోర్టు ముందు తర్వాతి దశలో చేస్తే: 10% కాస్ట్. సెషన్స్ కోర్టు/హైకోర్టు ముందు చేస్తే: 15% కాస్ట్.

సుప్రీంకోర్టు ముందు చేస్తే: 20% కాస్ట్. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ శాతం తగ్గించబడింది.

Next Story