రాష్ట్రపతి సూచనపై బిల్లుల ఆమోదం అంశంపై సుప్రీంకోర్టు కీలక విచారణ
రాష్ట్రపతి సూచనపై బిల్లుల ఆమోదం అంశంలో మంగళవారం సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది
By Knakam Karthik
రాష్ట్రపతి సూచనపై బిల్లుల ఆమోదం అంశంపై సుప్రీంకోర్టు కీలక విచారణ
రాష్ట్రపతి సూచనపై బిల్లుల ఆమోదం అంశంలో మంగళవారం సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. గవర్నర్లు బిల్లులను తిరిగి పంపకుండా నేరుగా నిలిపివేయగలరనే ఆర్టికల్ 200 వివరణపై రాజ్యాంగ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా వివరణను అంగీకరిస్తే గవర్నర్లు మనీ బిల్లులనూ అడ్డుకోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. “ఇది అత్యంత సమస్యాత్మకమని” న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి ఆధ్వర్యంలోని ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్ నాథ్, పి.ఎస్. నరసింహ, ఏ.ఎస్. చంద్రుర్కర్ విచారణ చేపట్టారు.
మహారాష్ట్ర తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హరీస్ సాల్వే వాదనకు ప్రతిస్పందిస్తూ జస్టిస్ నరసింహ అన్నారు: “యూనియన్ వాదన ప్రకారం గవర్నర్‌కు స్వతంత్రంగా withholding పవర్ ఉన్నట్టయితే మనీ బిల్లుని కూడా గవర్నర్ అడ్డుకోవచ్చు. ఇది పెద్ద సమస్య అవుతుంది. అయితే సాల్వే వాదన ప్రకారం రాజ్యాంగంలో “withholding” కూడా గవర్నర్‌కు లభించే నాలుగో ఆప్షన్. Article 200 లో ఎక్కడా మనీ బిల్లుపై పరిమితి ఉంచలేదని ఆయన స్పష్టం చేశారు. “రాజ్యాంగంలో పరిమితి లేకపోతే కోర్టు తనే అదనంగా పరిమితి విధించలేడు” అని సాల్వే చెప్పారు.
మనీ బిల్లుల సందర్భంలో Article 207 ఇప్పటికే safeguard అందిస్తుందని ఆయన వాదించారు. అయితే బిల్లు చివరగా గవర్నర్ సిఫారసు చేసిన రూపంలోనే ఆమోదం పొందకపోతే, గవర్నర్ అసమ్మతి తెలిపే అవకాశముందని సాల్వే సూచించారు. అలాగే గవర్నర్, రాష్ట్రపతికి నిర్ణయం తీసుకోవడానికి టైమ్ లిమిట్ విధించలేమని సాల్వే స్పష్టం చేశారు. “గవర్నర్ ఎందుకు బిల్లును నిలిపివేశాడని కోర్టు అడగగలదా?” అని CJI అడగగా, “అసలు కాదు” అని సాల్వే స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఈ వాదనలకు మద్దతుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాల తరఫున కూడా న్యాయవాదులు వాదించారు.