టీచర్స్ రిక్రూట్‌మెంట్ ప‌రీక్ష హాల్ టికెట్‌పై స‌న్నిలియోన్ ఫోటో

Sunny Leone's pic on hall ticket of Karnataka govt exam.తాను డౌన్‌లోడ్ చేసుకున్న ప‌రీక్ష హాల్ టికెట్‌పై త‌న ఫోటోకుబ‌దులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2022 3:53 AM GMT
టీచర్స్ రిక్రూట్‌మెంట్ ప‌రీక్ష హాల్ టికెట్‌పై స‌న్నిలియోన్ ఫోటో

కర్ణాటక టీచర్స్ రిక్రూట్‌మెంట్‌కు ఇటీవ‌ల నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు. ఆశావ‌హులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మ‌రికొద్ది రోజుల్లో ప‌రీక్ష ఉండ‌డంతో హ‌ల్ టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే.. ఓ యువ‌తికి మాత్రం షాకింగ్ ప‌రిణామం ఎదురైంది. తాను డౌన్‌లోడ్ చేసుకున్న ప‌రీక్ష హాల్ టికెట్‌పై త‌న ఫోటోకు బ‌దులు బాలీవుడ్ న‌టి స‌న్నిలియోన్ ఫోటో ముద్రించి ఉండ‌డం చూసి కంగుతింది. ఆ ఫోటో కూడా అస‌భ్య‌క‌రంగా ముద్రించి ఉంది. దీన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. విద్యాశాఖ విచార‌ణ‌కు ఆదేశించింది.

కాంగ్రెస్ సోష‌ల్ మీడియా చైర్ ప‌ర్స‌న్ బీఆర్ నాయుడు సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్ లు చూసే మంత్రులున్న ప్రభుత్వం నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలమని ఎద్దేవా చేశారు. నెటిజర్ల నుంచి కూడా ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది.

దీనిపై క‌ర్ణాట‌క విద్యాశాఖ స్పందించింది. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థి ఏ ఫొటో అప్ లోడ్ చేస్తే అదే ఫొటో ఆటోమేటిక్ గా హాల్ టికెట్ పై ప్రింట్ అవుతుందని తెలిపింది. దరఖాస్తు సమయంలో కావాలనో, లేక పొరపాటునో సన్నీ లియోన్ ఫొటో అప్ లోడ్ అయి ఉండవచ్చని పేర్కొంది. దీనిపై ఆ యువ‌తిని ప్ర‌శ్నించ‌గా త‌న భ‌ర్త స్నేహితుడు త‌న ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్‌లో నింపిన‌ట్లు చెప్పిన‌ట్లు పేర్కొంది. దీనిపై విచార‌ణ జ‌రిపి త్వ‌ర‌లోనే ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తామ‌ని అధికారులు చెప్పారు.

Next Story