దేశంలోనే తొలిసారి.. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న తొలి మహిళా ఎస్ఐ ప్రియాంక

Sub-Inspector Becomes First Woman Cop To Be Part Of Encounter.ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌లు అన్ని రంగాల్లో త‌మ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2021 6:52 AM GMT
దేశంలోనే తొలిసారి.. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న తొలి మహిళా ఎస్ఐ ప్రియాంక

ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌లు అన్ని రంగాల్లో త‌మ ప్ర‌తిభ‌ను చాటుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సైతం త‌మ‌దైన ముద్ర వేసుకుంటున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త చ‌రిత్ర‌లో ఎన్‌కౌంట‌ర్‌లో మ‌హిళ‌లు పాల్గొన్న సంద‌ర్భాలు లేవు. కానీ తాజాగా.. దేశంలో మొట్ట‌మొద‌టి సారి ఓ మ‌హిళా ఎస్ఐ.. ఎన్‌కౌంట‌ర్‌లో పాల్గొన్న ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో వెలుగుచూసింది. ఆ మ‌హిళా ఎస్ఐ పేరే ప్రియాంక‌. 2008వ సంవత్సరంలో ఢిల్లీ పోలీసు క్రైంబ్రాంచ్ లో ఎస్ఐగా చేరిన ప్రియాంక తాజాగా ప్రగతి మైదానంలో జరిగిన ఎన్‌కౌంటరులో పాల్గొని.. ఎన్‌కౌంటరులో పాల్గొన్న మహిళా ఎస్ఐగా పేరు పొందారని ఢిల్లీ అదనపు పోలీసు కమిషనర్ శిబేష్ సింగ్ చెప్పారు. ఈ ఎన్‌కౌంటరు అనంతరం గ్యాంగ్ స్టర్ రోహిత్ చౌదరి, అతని సహచరుడు పర్వీన్ అలియాస్ టిటును మహిళా ఎస్ఐ ప్రియాంక అరెస్టు చేశారు.

ఎన్ కౌంటర్ సందర్భంగా గ్యాంగ్ స్టర్లు ప్రియాంకపై కాల్పులు జరిపారు. అయితే తూటా ఆమె వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కు తగిలింది. దీంతో.. ఆమె సురక్షితంగా బయటపడ్డారు. గ్యాంగ్ స్ట‌ర్ రోహిత్ చౌదరి, టిటూల కాళ్లకు గాయాలవడంతో వారిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించామని మహిళా ఎస్ఐ ప్రియాంక చెప్పారు .ప్రియాంకను ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. మహిళా ఎస్ఐ ప్రియాంక అరెస్టు చేసిన గ్యాంగ్ స్టర్లకు రూ.5లక్షల రివార్డు ఉందని చెప్పారు.


Next Story