ఉపాధ్యాయులను గౌరవించడం విద్యార్థుల నైతిక చర్య. తప్పు చేస్తే.. ఉపాధ్యాయుడు సరిదిద్దగలిగినప్పుడు దాడికి ఎలాంటి చోటు ఉండకూడదు. తాజాగా పుస్తకం తీసుకురాలేదని తిట్టడంతో ఓ విద్యార్థి టీచర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మథురలోని బృందావన్‌లో పాఠశాలకు పుస్తకాలు తీసుకురాలేదని మందలించినందుకు ఒక విద్యార్థి తన గణిత ఉపాధ్యాయుడిని తరగతి గదిలో కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
వీడియోలో.. తరగతి గదిలోకి పుస్తకాన్ని తీసుకురాలేదని ఆరోపిస్తూ 10వ తరగతి విద్యార్థిని అతని ఉపాధ్యాయుడు తిట్టడం చూడవచ్చు. మరుసటి క్షణం బాలుడిని అతని ఉపాధ్యాయుడు తరగతి గది బయటకు పంపించాడు. ఆ తర్వాత అతను తన ఉపాధ్యాయుడిని నెట్టి, అతని కాలర్ పట్టుకుని, బెంచ్‌కు నొక్కి కొట్టాడు. వెంటనే అక్కడున్న విద్యార్థులు.. దాడి చేసిన విద్యార్థిని వెనక్కి లాగారు. పంకజ్ సింగ్ అనే ఉపాధ్యాయుడు 2004 నుంచి ఇదే పాఠశాలలో గణితం బోధిస్తున్నాడు. టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. విద్యార్థిపై పాఠశాల యాజమాన్యం కూడా కఠిన చర్యలు తీసుకుంది.
వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.