ఇందిరా గాంధీలా మమతా బెనర్జీని కాల్చండి అంటూ పోస్టులు.. స్టూడెంట్‌ అరెస్ట్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు

By Medi Samrat  Published on  19 Aug 2024 11:07 AM GMT
ఇందిరా గాంధీలా మమతా బెనర్జీని కాల్చండి అంటూ పోస్టులు.. స్టూడెంట్‌ అరెస్ట్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో హింసను ప్రేరేపించేలా పోస్టులు పెడుతున్నట్లు విద్యార్థిపై ఆరోపణలు వచ్చాయి. RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య నిర‌స‌లు జ‌రుగుతున్న క్ర‌మంలోనే ఈ అరెస్టు జరిగింది. విద్యార్థి 'కీర్తి సోషల్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీని సృష్టించాడు. ఈ ఖాతాలో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోస్ట్ చేశాడు.

ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు ప్రజలను ప్రేరేపించాడ‌ని విద్యార్థిపై ఆరోపణలు ఉన్నాయి. తన పోస్ట్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ.. మమతా బెనర్జీని కూడా అదే పద్ధతిలో చంపాల‌ని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ ట్విట్టర్‌లో తెలియజేశారు. శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను పంచుకుంటూ.. కోల్‌కతా పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీలా మమతా బెనర్జీని కాల్చండి అంటూ పోస్ట్‌లో రాశారు. ఇందిరా గాంధీలా మమతా బెనర్జీని కాల్చండి. మీరు చేయలేకపోతే.. నేను నిరాశ చెందను.. అంటూ చేసిన‌ పోస్ట్ త్వరగా వైరల్ అయ్యింది. చాలా మంది తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

హత్యకు గురైన వైద్యురాలి ఫోటోను కూడా విద్యార్థి పోస్టు చేసిన‌ట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన సంఘటనకు సంబంధించిన మూడు ఇన్‌స్టాగ్రామ్ కథనాలను అప్‌లోడ్ చేసినందుకు నిందితుడిపై ఫిర్యాదు అందిందని కోల్‌కతా పోలీసులు ఈ కేసులో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్ట్‌లలో బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడమే కాకుండా.. ముఖ్యమంత్రికి హత్య బెదిరింపులు కూడా వచ్చాయి.. ఇది తీవ్ర అభ్యంతరకరం. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్రేకపూరితమైనవని.. సామాజిక అశాంతిని.. వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేయగలవని పోలీసులు తెలిపారు.

Next Story