గుజరాత్‌లోని పోర్ బందర్‌లో గల ప్రఖ్యాత ఆర్య కన్యా గురుకులంలో నెల రోజుల క్రితం చేరిన 8వ తరగతి విద్యార్థిని సంచలన ఆరోపణలు చేసింది. విద్యార్థిని తల్లిదండ్రులు కూడా ఇతర హాస్టల్ మేట్స్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం చెలరేగింది. హాస్టల్‌లోని బాలికలను బలవంతంగా లెస్బియన్ సంబంధాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అయితే గురుకుల ప్రిన్సిపాల్, యాజమాన్యం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది ఇన్స్టిట్యూట్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం అని పేర్కొన్నారు.
నెల రోజుల క్రితం ఆర్య కన్యా గురుకులంలో చేరిన 8వ తరగతి విద్యార్థిని.. ''ఇతర హాస్టల్ మేట్స్ తనను లెస్బియన్ సంబంధాలు పెట్టుకోమని అడిగారని, రాకపోతే వేధింపులకు గురి చేస్తామని చెప్పారని'' ఆరోపించింది. ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ''హాస్టల్‌లో మెజారిటీ అమ్మాయిలు లెస్బియన్ సంబంధాలు కలిగి ఉన్నారు. హాస్టల్‌లో లెస్బియన్ రాకెట్ జరుగుతోంది. ఇది హాస్టల్ వార్డెన్‌కు కూడా తెలుసు. కొత్త విద్యార్థులను సంబంధాలు పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మా కుమార్తె ఈ విషయాన్ని మాకు చెప్పింది. ప్రధానోపాధ్యాయుడు ఈ విషయమై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే పాఠశాల, హాస్టల్ నుండి లీవింగ్ సర్టిఫికేట్ తీసుకున్నాం'' అని చెప్పారు.
ఈ విషయం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి రావడంతో, దాని సభ్యుడు డాక్టర్ చేతనాబెన్ తివారీ దీనిపై విచారణ ప్రారంభించారు. జిల్లా పోలీసులు కూడా ఈ అంశంపై సమాంతర విచారణ ప్రారంభించారు. ''ఇవి నిరాధార ఆరోపణలు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను 1936లో స్థాపించారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్తులోనూ జరగదు'' అని గురుకుల ప్రిన్సిపాల్ రంజానాబెన్ మజిథియా అన్నారు. తన కోరికకు విరుద్ధంగా బాలికను తల్లిదండ్రులు గురుకులంలో చేర్పించారు. ''ఆమె గురుకుల వాతావరణానికి సర్దుబాటు చేసుకోలేకపోయింది. అందుకే ఆమె, ఆమె తల్లిదండ్రులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు'' అని పేర్కొంది.