వీధికుక్కల సమూహం వృద్ధురాలి మృతదేహాన్ని పీక్కు తిన్న ఘటన.. కర్ణాటకలో దక్షిణ కాశీగా పేరొందిన సుక్షేత్ర గంగాపూర్‌లోని ద్యావమ్మన గుడి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటన చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వీధిలో చనిపోయిన అనాథైన వృద్ధురాలి మృతదేహాన్ని దహనం చేయకుండా వీధిలోనే వదిలేయడంతో.. మృతదేహంపై కుక్కల గుంపు దాడి చేసి శరీరంలోని పలు భాగాలను తినేశాయి. మృతి చెందిన వృద్ధురాలు నిరాశ్రయురాలు కావడంతో వీధి పక్కనే నివాసముంటున్నట్లు సమాచారం.
ఆలయం సమీపంలో కుక్కల గుంపు ఉండడంతో భక్తులు భయంతో ఆలయానికి రావడానికి జంకుతున్నారు. మాంసం రుచి మరిగిన కుక్కలు మనుషులపై దాడి చేస్తున్నాయి. దీంతో భక్తుల భద్రత కోసం కుక్కలను తరలించాలని, ప్రస్తుతం ఇక్కడి సంగమం వద్ద వందలాది మంది నిరుపేదలు బస చేస్తున్నారని, వారికి సరైన రక్షణ కల్పించాలన్నాని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. నిరుపేదల కోసం ప్రభుత్వం ఆశ్రమం నిర్మించి ఆలయం పేరు చెడకుండా చూడాలని స్థానిక ప్రజలు, నిరుపేదలు మత దేవాదాయ శాఖను కోరారు.
మరోక ఘటనలో వీధికుక్కల దాడిలో గాయపడి ఏడాది వయస్సు గల చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. చిన్నారి నోయిడాలోని లోటస్ బౌలేవార్డ్ సొసైటీలో పని చేసే కార్మికుడి కొడుకుగా పోలీసులు గుర్తించారు. సొసైటీ ఆవరణతో తన సొదరుడితో ఆడుకుంటున్న సమయంలో అటుగా వచ్చిన వీధికుక్కల గుంపు దాడి చేసింది. మూడు కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. చిన్నారి అరుపులతో అక్కడి చేరుకున్న తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.