దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి జబల్‌పూర్‌కు స్పైస్ జెట్ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటి తరువాత విమానం సుమారు 5 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఒక్కసారిగా క్యాబిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణీకులు భయాందోళనలు చెందారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవ్వరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణీ కులందరూ సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. క్యాబిన్‌లో పొగతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. బీహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టులో గత నెల 19న స్పైస్ జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే.