తస్మాత్ జాగ్రత్త.. వధువు ముఖం దగ్గర పేలిన స్పార్ల్కింగ్‌ గన్

Sparkling Gun Blows Up On Bride's Face. పెళ్లి రోజు అనేది ఎంతో స్పెషల్. జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా పరిగణిస్తారు

By M.S.R  Published on  1 April 2023 11:13 AM GMT
తస్మాత్ జాగ్రత్త.. వధువు ముఖం దగ్గర పేలిన స్పార్ల్కింగ్‌ గన్

Sparkling Gun Blows Up On Bride's Face


పెళ్లి రోజు అనేది ఎంతో స్పెషల్. జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా పరిగణిస్తారు. అయితే ఆ సమయాల్లో చోటు చేసుకునే ఘటనలు జీవితాంతం గుర్తుండిపోతాయి. కొన్ని కొన్ని సార్లు మధురమైన క్షణాలు కాస్తా.. పీడకలలుగా మారిపోతాయి. తాజాగా అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

మహారాష్ట్రకు చెందిన ఒక పెళ్లిలో స్పార్క్లింగ్ గన్ కాస్తా పేలిపోయింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వధూవరులు తమ పెళ్లి రోజున స్పార్క్లింగ్ గన్ తో పోజులిస్తూ ఉండగా.. పెళ్లి కూతురు పట్టుకున్న గన్ కాస్తా పేలిపోయింది. 13 సెకన్ల క్లిప్‌లో స్పార్క్లింగ్ గన్ ఒకటి వధువు ముఖానికి దగ్గరగా పేలిపోయింది. వధువు తుపాకీని వెంటనే కింద పడేసింది. ఆమెను రక్షించేందుకు అందరూ పరుగులు తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


Next Story