ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన ద‌క్షిణ మ‌ధ్య రైల్యే

South Central Railway Cancelled 10 Trains.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు లేకపోవడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

By Medi Samrat  Published on  26 April 2021 1:04 PM GMT
railway trains cancelled

కరోనా మ‌హ‌మ్మారి దృష్ట్యా ద‌క్షిణ మ‌ధ్య రైల్యే పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేర‌కు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు లేకపోవడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 28 - మే 31 మధ్య నరసాపురం - నిడదవోలు, నిడదవోలు - నరసాపురం ఎక్స్‌ప్రస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా అదే తేదీల్లో సికింద్రాబాద్‌-బీదర్, బీదర్‌ -హైదరాబాద్‌ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

రద్దయిన మరిన్ని రైళ్ల వివరాలు..

ఏప్రిల్‌ 28- మే 31 వరకు సికింద్రాబాద్‌ -కర్నూలు ఎక్స్‌ప్రెస్‌

ఏప్రిల్‌ 29- జూన్‌ 1 వరకు కర్నూలు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌

ఏప్రిల్‌ 30- మే 28 వరకు మైసూర్‌-రేణిగుంట ఎక్స్‌ప్రెస్

మే 1- మే 29 వరకు రేణిగుంట-మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌

ఏప్రిల్‌ 30- మే 28 వరకు సికింద్రాబాద్‌- ముంబయి ఎల్‌టీటీ




Next Story