22 మంది ప్రాణాలను కాపాడిన సోనూ సూద్ బృందం

Sonu Sood, Team Save Lives Of 22 Covid Patients. కర్ణాటకలోని సోనూసూద్ ఛారిటీ పౌండేష‌న్‌ బృందం సకాలంలో స్పందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న 22 మంది రోగుల ప్రాణాలను రక్షించింది.

By Medi Samrat  Published on  5 May 2021 3:23 PM IST
Sonu Sood team

సోనూసూద్‌.. లాక్‌డౌన్‌లో ఎంతోమంది స‌మ‌స్య‌లు తీర్చి ఆపద్భాంధవుడు అయ్యాడు. అలాగే గ‌త కొంత కాలంగా సాయం కోసం అర్ధించిన ప్ర‌తి ఒక్క‌రిని ఆదుకుంటూనే ఉన్నాడు. తాజాగా సోనూ సూద్ ఛారిటీ పౌండేష‌న్‌ బృందం సభ్యులు తమ‌ సేవా గుణాన్ని చాటుకున్నారు. కర్ణాటకలోని సోనూసూద్ ఛారిటీ పౌండేష‌న్‌ బృందం సకాలంలో స్పందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న 22 మంది రోగుల ప్రాణాలను రక్షించింది.

బెంగళూరులోని అరక్ ఆసుప‌త్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడినట్లు ఛారిటీ బృందానికి సందేశం అందింది. అప్ప‌టికే ఆక్సిజ‌న్‌ అందక ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు.. మ‌రో 22 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నార‌ని ఆ సందేశం సారాంశం. విషయాన్ని తెలుసుకున్న‌ సోనూసూద్ ఛారిటీ బృందం.. స‌త్వ‌ర‌మే స్పందించి కొన్ని నిమిషాల్లోనే అరక్‌ హాస్పిటల్‌కి 16 ఆక్సిజన్‌ సిలిండర్లను అందించింది.


Next Story