'దేశ్ కే మెంటార్స్' అంబాసిడ‌ర్‌గా సోనుసూద్‌

Sonu Sood APPOINTED as brand ambassador of 'Desh Ke Mentors' program.క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతోమందికి సాయం చేసి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2021 8:00 AM GMT
దేశ్ కే మెంటార్స్ అంబాసిడ‌ర్‌గా సోనుసూద్‌

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతోమందికి సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనుసూద్‌. ఇప్పుడు ఆయ‌న స‌రికొత్త బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఢిల్లీ ప్ర‌భ్వుతం త్వ‌ర‌లో తీసుకురానున్న దేశ్ కే మెంటార్స్ కార్య‌క్ర‌మానికి ఆయ‌న్ను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించారు. ఈ విష‌యాన్ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ శుక్ర‌వారం మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. ఈ స‌మావేశంలో సోనుసూద్ కూడా పాల్గొన్నారు.

విద్యార్థుల కోసం దేశ్ కే మెంటార్స్ కార్య‌క్ర‌మాన్ని ఢిల్లీ ప్ర‌భుత్వం ప్రారంభించనుంది. చాలా మంది విద్యార్థుల‌కు భ‌విష్య‌త్తు గురించి స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉండ‌దు. త‌రువాత ఏం చేయాల‌ని ఎలా చేయాలి.. ఎక్క‌డికి వెళ్లాలి అనే అంశాల గురించి వారికి తెలియ‌దు. వారికి దిశా నిర్దేశం చేయాల‌నే ల‌క్ష్యంతోనే దేశ్ కే మెంటార్స్ కార్య‌క్ర‌మాన్ని తీసుకురానున్న‌ట్లు కేజ్రీవాల్ తెలిపారు. దీనికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు సోనుసూద్ అంగీక‌రించినందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

లక్షలాది మంది విద్యార్థులకు మార్గ‌నిర్దేశం చేసే అవ‌కాశం త‌న‌కు ఈ రోజు ల‌భించింద‌ని, విద్యార్థుల‌కు దిశానిర్దేశం చేయ‌డం కంటే గొప్ప సేవ మ‌రొక‌టి లేద‌ని సోనుసూద్ అన్నారు. సీఎంతో క‌లిసి ప‌నిచేస్తాన‌న్నారు. లాక్‌డౌన్ ప్రారంభ‌మైన‌ప్ప‌టికి నుంచి ఎంతో మందిని క‌లిసాన‌ని.. అప్పుడే చ‌దువు ఒక పెద్ద స‌మ‌స్య‌గా ఉంద‌ని అర్థ‌మైంద‌ని చెప్పారు. చిన్నారుల‌కు స‌రైన మార్గ‌నిర్దేశం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గ్ర‌హించిన‌ట్లు సోను తెలిపారు.

ఇక రాజ‌కీయాల్లోకి చేరిక గురించి ప్ర‌శ్నించ‌గా.. సోనూసూద్ నవ్వుతూ సమాధానమిచ్చారు. మంచి ప‌నులు చేస్తున్నారు గ‌దా రాజకీయాల్లోకి వెళ్లాల‌ని చాలా మంది చెబుతున్నారు. అలాంటి అవ‌కాశాలు చాలానే వ‌చ్చాయి. అయితే.. దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించ‌లేదు. మంచి ప‌నులు చేయ‌డానికి రాజ‌కీయాలే అవ‌స‌రం లేద‌న్నారు. అంతేకాదు.. సీఎం కేజ్రీవాల్‌తో జ‌రిగిన స‌మావేశంలో కూడా ఈ ప్ర‌స్తావ‌న రాలేద‌న్నారు.

Next Story