పంద్రాగస్టు వేడుకల అనంతరం.. స్కూల్‌లో డ్ర‌గ్ పార్టీ కలకలం

Some men were seen consuming drugs inside a school in Rajasthan. రాజస్థాన్‌లోని ఓ పాఠశాలలో కొందరు వ్యక్తులు డ్రగ్స్ సేవిస్తూ కనిపించారు. పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల

By అంజి  Published on  16 Aug 2022 9:12 AM GMT
పంద్రాగస్టు వేడుకల అనంతరం.. స్కూల్‌లో డ్ర‌గ్ పార్టీ కలకలం

రాజస్థాన్‌లోని ఓ పాఠశాలలో కొందరు వ్యక్తులు డ్రగ్స్ సేవిస్తూ కనిపించారు. పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. బర్మార్‌ జిల్లాలోని ఓ గవర్నమెంట్‌ స్కూల్‌లో డ్రగ్స్‌ సేవించడం కలకలం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం పాఠశాలల కొందరు డ్రగ్స్‌ సేవించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒపియం, పప్పీ హస్క్‌ వంటి నిషేధిత డ్రగ్స్‌ తీసుకున్నారని చీఫ్‌ బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ ఓంప్రకాష్‌ విష్ణోయ్‌ వెల్లడించారు.

గుడమలని ప్రాంతంలోని ఓ ప్రభుత్వం స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వాంతత్ర్య దినోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత దాదాపు 12 మంది పాఠశాలకు చేరుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. వైరల్‌ అయిన నాలుగు వీడియోల ప్రకారం.. నిందితులు ఒకరికొకరు డ్రగ్స్‌ షేర్‌ చేసుకుని సేవించారు. ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న త‌ర్వాత అధికారులు అక్క‌డికి చేరుకునే స‌మ‌యానికి నిందితులు ఎవ‌రూ లేర‌ని విష్ణోయ్ తెలిపారు.

విద్యార్ధులు, టీచ‌ర్ల స్టేట్‌మెంట్ న‌మోదు చేసుకుని నిందితుల ఆచూకీ ప‌సిగ‌డ‌తామ‌ని చెప్పారు. కేసు న‌మోదు చేసి త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని విష్ణోయ్ వెల్ల‌డించారు. వైరల్ వీడియోలో పాఠశాల పేరు కూడా కనిపిస్తుంది. పాఠశాల వరండాలో కొందరు గ్రామస్తులు మందు తాగుతూ కనిపిస్తున్నారు. ఈ విషయం గూడమలానీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో, ప్రజలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని విద్యాశాఖ ఇంకా ధృవీకరించలేదు.

Next Story
Share it