మణిపూర్‌లో దారుణం.. సెలవుపై వచ్చిన సైనికుడిని కిడ్నాప్ చేసి హత్య

మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో ఓ ఆర్మీ సైనికుడిని అతని ఇంటి నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.

By అంజి  Published on  18 Sep 2023 1:01 AM GMT
Soldier, kidnap, Manipur, killed, Crime news

మణిపూర్‌లో దారుణం.. సెలవుపై వచ్చిన సైనికుడిని కిడ్నాప్ చేసి హత్య

మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో ఓ ఆర్మీ సైనికుడిని అతని ఇంటి నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారని అధికారులు ఆదివారం తెలిపారు. నిన్న ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతని మృతదేహం లభ్యమైంది. శనివారం ఉదయం 10 గంటలకు అపహరణ జరిగినప్పుడు సిపాయి సెర్టో తంగ్‌తంగ్ కోమ్ అనే సైనికుడు సెలవులో ఉన్నాడు. అతను ఈశాన్య రాష్ట్రంలోని లీమాఖోంగ్ మిలిటరీ స్టేషన్‌లో విధులు నిర్వహించేవాడు. అతని 10 ఏళ్ల కుమారుడు, ఏకైక ప్రత్యక్ష సాక్షి అయిన ప్రకారం.. అతను, అతని తండ్రి వరండాలో పని చేస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు వారి ఇంటికి ప్రవేశించారు.

"సాయుధ వ్యక్తులు సిపాయి తలపై పిస్టల్ ఉంచి, అక్కడి నుండి పారిపోయే ముందు అతన్ని తెల్లటి వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు" అని అతని కొడుకు చెప్పాడని అధికారులు తెలిపారు. అధికారులు ఇంకా మాట్లాడుతూ.."ఆదివారం తెల్లవారుజాము వరకు సిపాయి కోమ్ గురించి ఎటువంటి వార్త లేదు. ఉదయం 9.30 గంటలకు, ఇంఫాల్ ఈస్ట్‌లోని సోగోల్‌మాంగ్ పీఎస్‌ పరిధిలోని మోంగ్‌జామ్‌కు తూర్పున ఉన్న ఖునింగ్‌థెక్ గ్రామంలో అతని మృతదేహం కనుగొనబడింది." కోమ్ యొక్క గుర్తింపును అతని సోదరుడు, బావ ధృవీకరించారు. సైనికుడి తలపై ఒకే బుల్లెట్ గాయం ఉందని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది.

సమాచారం ప్రకారం.. సైనికుడి అంత్యక్రియలు కుటుంబ సభ్యుల కోరిక మేరకు నిర్వహించబడతాయి. మృతుల కుటుంబానికి సహాయం చేయడానికి సైన్యం ఒక బృందాన్ని పంపింది.

Next Story