గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి (102) సోమవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న శకుంతలా చౌదరి.. గౌహతిలోని కస్తూర్బా ఆశ్రమంలో ఆదివారం రాత్రి 10 గంటలకు మృతి చెందారు. అస్సాంలోని కామ్రూప్‌కు చెందిన ఆమె గ్రామస్థుల సంక్షేమం కోసం, ముఖ్యంగా మహిళలు, పిల్లల కోసం పనిచేసింది. 'శకుంతల బైడియో'గా ప్రసిద్ధి చెందింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆమె భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎంపికైంది.
శకుంతలా చౌదరి మృతి పట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. గాంధేయ విలువలను పెంపొందించేందుకు శకుంతలా చౌదరి జీవితాంతం చేసిన కృషికి గుర్తుండిపోతారని ఆయన అన్నారు. "సరనియా ఆశ్రమంలో ఆమె చేసిన గొప్ప పని చాలా మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసింది. ఆమె మరణించడం బాధాకరం అన్నారు. శకుంతలా చౌదరి మృతిపట్ల అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ సంతాపం తెలిపారు.