మాస్క్ లేకుండా బయటకొస్తే ఆరు నెలలు జైలే!
Six moths of Imprisonment for no Mask says Innocent Divya. ఊటీలో మాస్క్ ధరించని వారికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామని అధికారులు హెచ్చరికల జారీ చేశారు.
By Medi Samrat Published on 12 March 2021 12:08 PM GMT
దేశంలో గత ఏడాది కరోనా ఎంత బీభత్సం సృష్టించిందో తెలిసిందే. చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకు వచ్చిన ఈ కరోనా మహమ్మారి దేశంలో ఎంతో మంది ప్రాణాలు బలికొంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్, కర్ఫ్యూ, కరోనా నుంచి భద్రతా చర్యలు తీసుకుంటున్న క్రమంలో కాస్త తగ్గు ముఖం పట్టిందని అన్నారు. ఈ మద్యనే కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చింది. అయితే కొంత మంది నిర్లక్ష్య వైఖరి వల్ల మళ్లీ కరోనా ప్రభావం పెరిగిపోతుంది. ముఖ్యంగా మాస్క్ ధరించకుండా.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా జనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. జనాలకు సూచనలతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసుల పరిస్థితి ఎలా ఉందీ అంటే మరోసారి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కరోనా ను కట్టడి చేయడానికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీలో మాస్క్ ధరించని వారికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామని అధికారులు హెచ్చరికల జారీ చేశారు. ప్రస్తుతం వేసవి ఈ నేపథ్యంలో అక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువ ఉంటుంది. పర్యాటకుల వల్ల స్థానికులకు కూడా ఇబ్బంది కలగవొచ్చని ఈ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సమాచారం.
మాస్క్ పెట్టుకోవాలనే నిబంధనలు తప్పనిసరి చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే 6 నెలలు జైలు తప్పదని జిల్లా కలెక్టర్ ఇన్నోసెంట్ దివ్య హెచ్చరిక జారీ చేశారు. నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్సెంట్ దివ్య ప్రజల్ని హెచ్చరిస్తూ.. ఊటీలోని ప్రజలు, పర్యాటకులు మాస్కులు ధరించకుండా బహరంగ ప్రదేశాల్లో తిరిగితే 6 నెలల జైలుశిక్ష విధిస్తామని ప్రకటించారు.మాస్కులు పెట్టుకోకుండా తిరిగేవారిని గుర్తించటానికి ఇప్పటికే 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు జరిమానాల రూపంలో రూ.30.68 లక్షలు వసూలు చేశామని తెలిపారు.